వాచ్ మెన్ టూ హీరో @24 ఏళ్ల జర్నీ ఇంట్రెస్టింగ్!
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేని నటుడి కష్టాలు వర్ణనాతీతం. సినిమాల్లోకి రావాలి? అన్న ఆలోచన మొదలైన నాటి నుంచే కష్టాలు మొదలైపోతాయి.
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేని నటుడి కష్టాలు వర్ణనాతీతం. సినిమాల్లోకి రావాలి? అన్న ఆలోచన మొదలైన నాటి నుంచే కష్టాలు మొదలైపోతాయి. కష్టపడే తత్వ..ఒదిగి ఉండే గుణం ఉన్నవారే ఇండస్ట్రీలో రాణిస్తా రని ఎంతో మంది నిరూపించారు. బిగ్ బీ అమితాబచ్చన్..మెగాస్టార్ చిరంజీవి అంతా అలా ఎదిగిన నటులే. ఎదిగే క్రమంలో ఉన్నో అవమానాలు..సవాళ్లు చూసిన వారే. వాళ్ల స్పూర్తితోనే ఇప్పటికీ బాలీవుడ్.. టాలీవుడ్ కి చాలా మంది నటులొస్తున్నారు.
అందుకే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ అతీతం కాదు. అతను కూడా హిందీ పరిశ్రమకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. నటుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టిన నాటి నుంచి సక్సెస్ అయ్యే వరకూ ఎన్నో అవమానాలు భరించారు. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు కాబట్టే నేడు సహజ నటుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజల్లో తానో స్పెషల్ అని ప్రపంచానికి చాటి చెప్పారు. నేటితో ఆయన బాలీవుడ్ కి ప్రవేశించి 24 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సంద ర్భంగా ఆయన గురించి మరికొన్ని విశేషాలు..
బాలీవుడ్ లో రియలిస్టిక్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకునే నటుడాయన. ఎంతమంది నటులున్నా పరిశ్రమలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. పాజిటివ్ పాత్రలు పోషించినా..నెగిటివ్ రోల్స్ పోషించినా..పాత్ర ఎలాంటిదైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. తన నటతనో ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చే ఏకైక నటుడు. 1999లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమా ‘సర్ఫరోష్’. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్ సాగిపోయింది.
ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించి నటుడిగా చిరస్థాయి ముద్ర వేసారు. నవాజుద్దీన్ ని దృష్టిలో పెట్టుకునే రచయితలు కథలు రాయడం మొదలైంది. కేవలం అతని నటనతోనే ఇదంతా సాధ్యమైంది. ఇంత కాలం బాలీవుడ్ లో సత్తా చాటిన నవాజుద్దీని `సైంధవ్` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగు పరిశ్రమలోనూ బిజీ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. నవాజుద్దీన్ సినిమాల్లోకి రాక ముందు కుటుంబ పోషణ కోసం చాలా ఉద్యోగాలు చేసారు. వృత్తిలో కొనసాగుతూనే సినిమా ప్రయత్నాలు చేసారు. ఈ క్రమంలో వాచ్ మెన్ గానూ నవాజుద్దీన్ పనిచేసారు.