నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియో.. ఆ కిస్ మూమెంట్ హైలెట్!

కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. రెండేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Update: 2024-12-19 08:23 GMT

కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. రెండేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగపిల్లలకు పేరెంట్స్ అయ్యారు. అలా నయన్, విఘ్నేష్ అటు కెరీర్ లైఫ్ ను.. ఇటు ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా డీల్ చేస్తున్నారు!

అయితే 2022 జూన్ 9వ తేదీన నయన్, విఘ్నేష్ వివాహం.. చెన్నై సమీపంలో మహాబలిపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేష్ పెళ్లికి వచ్చి సందడి చేశారు.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పిక్స్ ను నయన్, విఘ్నేష్ పలుమార్లు షేర్ చేశారు. సోషల్ మీడియాలో అవి ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. స్పెషల్ అకేషన్స్ కు నెటిజన్లు పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మ్యారేజ్ వీడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

నయన్, విఘ్నేష్ పెళ్లి ఫోటోగ్రాఫర్స్.. ఆ వీడియోను రీసెంట్ గా షేర్ చేశారు. మ్యారేజ్ సెట్స్ కోసం అండ్ మిగతా విషయాలు షేర్ చేస్తూ.. ఫస్ట్ వెడ్డింగ్ గ్లింప్స్ పేరుతో విడుదల చేశారు. వీడియోలో నయన్.. ఐకానిక్ రెడ్ కలర్ బ్రైడల్ చీర కట్టుకుని.. పెళ్లి కూతురు గెటప్ లో నడుస్తూ.. వివాహ వేదిక వద్దకు వస్తూ కనిపించారు.

ఆ సమయంలో విఘ్నేష్ ఆమె కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని వేద మంత్రాల మధ్య నయన్ మెడలో కడతారు. అయితే వీడియోలో సెలబ్రిటీలను కూడా చూపించారు. షారుక్, రజనీ.. నయన్, విఘ్నేష్ పై పూల వర్షం కురిపించారు. సూర్య, జ్యోతిక ఒకరినొకరు చూసుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టు ఉన్నారు.

వీడియోలో మెహందీ బిట్స్ ను కూడా యాడ్ చేశారు. అందులో నవ్వుతూ క్యూట్ గా కనిపించారు నయన్. అదే సమయంలో విఘ్నేష్ .. నయన్ నుదిటిపై ఎమోషనల్ అండ్ రొమాంటిక్ కిస్ పెట్టారు. వీడియో మొత్తంలో కిస్ మూమెంట్ హైలెట్ గా నిలిచింది. వెడ్డింగ్ గ్లింప్స్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే సుమారు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత విగ్నేష్, నయన్.. పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News