లేడీ సూపర్ స్టార్ బయటకి వచ్చింది.. వివాదం మొదలైంది
లేడీ సూపర్ స్టార్ నయనతార తో సినిమాలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార తో సినిమాలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతారు. అయితే అదే నిర్మాతలు ఆమె ను ఒక విషయంలో విమర్శిస్తూ ఉంటారు. అదేంటి అంటే... ఆమెకు ఎంత పారితోషికం ఇచ్చినా కూడా ప్రమోషన్ కి హాజరు అవ్వదు. ఆమె ప్రమోషన్ కి హాజరు అవ్వక పోవడం వల్ల సినిమా కి పబ్లిసిటీ సరిగా జరగదు అనేది కొందరి అభిప్రాయం.
స్టార్ హీరోల సినిమాల్లో నటించిన, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కూడా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ తాజాగా ఆమె నటించిన అన్నపూర్ణి సినిమా ప్రమోషన్ కోసం బయటకు వచ్చింది. ఒక లేడీ హాస్టల్ లో రియల్ అన్నపూర్ణి అవతారం ఎత్తింది.
స్వయంగా తన చేతులతో అమ్మాయిలకు వడ్డించడం ద్వారా ఆమె తన అన్నపూర్ణ సినిమా ను ప్రమోట్ చేసుకుంది. చాలా కాలం తర్వాత అన్నపూర్ణి సినిమా ప్రమోషన్ కోసం నయనతార బయటకు వచ్చిన నేపథ్యం లో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణి సినిమా ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక నయనతార అన్నపూర్ణి సినిమా విషయంలో బ్రహ్మణ సామాజిక వర్గంకు చెందిన వారు ఆందోళన మొదలు పెట్టారు. సినిమా కథానుసారం హీరోయిన్ బ్రహ్మణ కుటుంబంకు చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి దేశంలోనే నెం.1 చెఫ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తన మతం, కులం ను పక్కన పెట్టి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది.
ఇప్పుడు అదే పాయింట్ బ్రహ్మణులకు నచ్చడం లేదు. బ్రహ్మణ సామాజీక వర్గంకు చెందిన వారిని మాంసాహారం వండే వారిగా ఎలా చూపిస్తారు అంటూ తమిళనాడు బ్రహ్మణ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా బ్రహ్మణ సామాజిక వర్గం కు చెందిన అమ్మాయి ముస్లీం అబ్బాయితో ప్రేమలో పడ్డట్లుగా చూపించారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నపూర్ణి సినిమాను బ్యాన్ చేయాలంటూ ఇప్పటికే తమిళనాడులోని ముఖ్య నగరాల్లో బ్రహ్మణ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నయనతార తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు బ్రహ్మణ సంఘం సమాజంకు క్షమాపణలు చెప్పాల్సిందే అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రచారం కోసం నయన్ బయటకు వచ్చింది కదా అని సంతోషిస్తున్న సమయంలో బ్రహ్మణ సంఘం వివాదం ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ కి ఆవేదన కలిగిస్తున్నాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పై బ్రహ్మణ సంఘాల ఆందోళనలు ఎంత వరకు పని చేస్తాయి అనేది చూడాలి.