మరోసారి ఆ క్రేజీ కాంబినేషన్!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ వావ్ అనిపిస్తుంటాయి. దర్శకుల కాంబో కంటే హీరో-హీరోయిన్ల కలయిక అన్నది మరింత క్రేజీగా ఉంటుంది
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ వావ్ అనిపిస్తుంటాయి. దర్శకుల కాంబో కంటే హీరో-హీరోయిన్ల కలయిక అన్నది మరింత క్రేజీగా ఉంటుంది. బాలయ్య తో నయనతార నటిస్తే ఎంత అందంగా ఉంటుందో? తల అజిత్ తో నయన్ నటించినా అంతే అందంగా ఉంటుంది. ఇలా హైప్ కొన్ని కాంబినేషన్లకే సాధ్యం. ఇప్పటికే అజిత్-నయనతార కలిసి `బిల్లా`..`విశ్వాసం` లాంటి చిత్రాల్లో అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు తెరపై కనిపిస్తే అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు.
ఆన్ స్క్రీన్ పై ఇద్దరి కెమిస్ట్రీ ఎంతో బాగా వర్కౌట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ కాంబినేషన్ కలిపే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో `గుడ్ బ్యాడ్ అగ్లీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అయితే ఇందులో హీరోయన్ ఇంత వరకూ ఫైనల్ అవ్వలేదు.
అజిత్ కి జోడీగా ఏ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు కూడా ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. దీంతో తొలిసారి నయనతారతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పాత్రకి నయన్ అయితే పర్పెక్ట్ గా సూటవుతుందని దర్శకుడు ఇంకెవ్వర్నీ సంప్రదించకుండా నేరుగా నయన్ కే టచ్ లోకి వెళ్లినట్లు చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది. నయన్ ఎంట్రీ గనుక ఖరారైతే ఇద్దర్నీ రానున్న ఐదవ సినిమా అవుతుంది.
`బిల్లా`..`విశ్వాసం` మంచి విజయం సాధించిన మిగిలిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత ఆ కాంబోలో మళ్లీ సినిమా రాలేదు. మళ్లీ ఇంత కాలానికి చేతులు కలిపే ప్రయత్నాలు జరుగుతోన్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నయనతార నటించిన `టెస్ట్` రిలీజ్ కి రెడీగా ఉంది. మరో సినిమా `డియర్ స్టూడెంట్` సెట్స్ లో ఉంది. అలాగే మమ్ముట్టి, కవిన్ రాజు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి.