న‌య‌న్ అప్ప‌ట్లో అంత రూడ్ గానా?

'సెట్స్ లో ఎంతో రూడ్ గా ఉంటుందిట‌. చిన్న చిన్న విష‌యాలకే కోప‌గించుకునేద‌ట‌. ఇంకా న‌చ్చ‌క‌పోతే అంద‌రి ముందు బిగ్గ‌ర‌గా అరిచేద‌ట‌.

Update: 2024-04-28 09:30 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కామ్ గోయింగ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోతో గొడ‌వ ప‌డింద‌ని గానీ... ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌తో త‌గాదాల‌కు దిగింద‌ని కానీ ఏనాడు ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు తెరపైకి రాలేదు. స‌హ న‌టుల‌తో సైతం ఎంతో స్నేహంగా ఉటుంద‌నే తప్ప‌! త‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు మీడియాలో ఎక్క‌డా హైలైట్ కాలేదు.సెట్స్ కి వ‌స్తే త‌న‌ప‌ని తాను చూసుకుని వెళ్లిపోతుంది త‌ప్ప ఇత‌ర ఎలాంటి విష‌యాల్లో క‌ల‌గ‌జేసుకోద‌ని త‌రుచూ వినిపిస్తూనే ఉంటుంది.

ఇదంతా అంద‌రికీ తెలిసిన న‌య‌న‌తార‌. మ‌రి ఆమెకి తెలిసిన న‌య‌న‌తార ఎవ‌రు? అంటే అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ట‌. 'సెట్స్ లో ఎంతో రూడ్ గా ఉంటుందిట‌. చిన్న చిన్న విష‌యాలకే కోప‌గించుకునేద‌ట‌. ఇంకా న‌చ్చ‌క‌పోతే అంద‌రి ముందు బిగ్గ‌ర‌గా అరిచేద‌ట‌. ఎంతో విసుగ్గాను ఉండేద‌ట‌. చుట్టూ ఉన్న వారిపై కూడా కొన్ని సంద‌ర్భాల్లో అరిచేసిదిట‌. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి న‌య‌న‌తార‌. ఇప్పుడు అందుకు పూర్తి భిన్న‌మైన న‌య‌న‌తార‌ని చూస్తున్నారంది.

ఎన్నో ర‌కాల అనుభ‌వం నుంచి కామ్ గా ఉండ‌టం...స‌హ‌నంగా ఉండ‌టం వంట‌వి అల‌వ‌ర్చు కున్న‌ట్లు తెలిపింది. కెరీర్ ఆరంభంలో...ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్త‌లో సెట్స్ కి వెళ్తే ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు బుర్ర‌ని తొలిచేసేవ‌ట‌. అలా విసుగు చెంద‌టంతోనే మిగ‌తా వారిప‌ట్ల కాస్త రూట్ గా వ్య‌వ‌హ‌రించేదిట‌. ఇప్పుడు అలా లేనిన‌న ఎంతో కామ్ గా ఉంటున్న‌ట్లు తెలిపింది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంచుకుంటే మైండ్ కూడా అంతే ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఇక ఖాళీ స‌మ‌యం ఉంటే? ఇంట్లో ఉండ‌టం త‌ప్ప త‌న‌కు స్నేహితులు కూడా పెద్ద‌గా లేరని..ప‌బ్ క‌ల్చ‌ర్ లాంటివి పెద్ద‌గా అల‌వాటు కూడా లేద‌ని తెలిపింది. పెళ్లైన త‌ర్వాత ఎక్కువ‌గా భ‌ర్త‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్న‌ట్లు ..షూటింగ్ ఉంటే సెట్లోనూ లేదంటే భ‌ర్త‌తో క‌లిసి ఇత‌ర బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చింది. అదీ సంగ‌తి. ఇక న‌య‌న్ బిజీ షెడ్యూల్ గురంచి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం త‌మిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇత‌ర భాష‌ల్లో అవ‌కాశాలు వ‌స్తున్నా! సెల‌క్టివ్ గా ఉంటుంది. స్టోరీ బాగా క‌నెక్ట్ అయితే త‌ప్ప చేయ‌డం లేదు.

Tags:    

Similar News