పిక్‌ టాక్ : సూపర్‌ స్టార్‌ చిల్‌ మూడ్‌, క్యూట్‌ పిక్స్‌

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు నెటిజన్స్‌ కి తెగ నచ్చేస్తున్నాయి

Update: 2024-06-19 04:15 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు నెటిజన్స్‌ కి తెగ నచ్చేస్తున్నాయి. ఆమె గతంలో స్కిన్‌ షో ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయ్యేది. కానీ ఇప్పుడు పిల్లలు మరియు తన భర్త తో ఉన్న ఫోటోలను షేర్ చేసినా కూడా వైరల్‌ అవ్వడం విశేషం.

తాజాగా పిల్లలను బాహుబలి ఐకానిక్ ఫోజ్ లో ఇన్ స్టా లో విఘ్నేష్ శివన్ షేర్ చేయడం జరిగింది. తాజాగా నయనతార ఇలా తన భర్త విఘ్నేష్ శివన్‌ తో కలిసి చిల్‌ అవుతున్న ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు వైరల్‌ అయ్యింది.

నయనతార వరుస సినిమాలతో సందడి చేస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అందుకే లేడీ సూపర్‌ స్టార్‌ గా అభిమానుల మన్ననలను పొందుతున్న విషయం తెల్సిందే.

పిల్లలకు తల్లి అయిన తర్వాత, భార్య గా బాధ్యతలు పెరిగిన తర్వాత కూడా నయనతార అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోల్లో ఆమె పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సింపుల్‌ వైట్‌ టీ షర్ట్ లో బ్లూ స్కర్ట్‌ లో నయనతార సింప్లీ సూపర్‌ అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో వరుస అందాల ఫోటోలను మరియు క్యూట్ ఫోటోలను షేర్‌ చేస్తున్న నయనతార ఇన్ స్టా లో దాదాపుగా 8.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. మరో పదేళ్ల పాటు లేడీ సూపర్ స్టార్‌ సినిమాలతో బిజీగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News