17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో ప్రభాస్.. సెట్టయినట్లేనా?

తెలుగు సినిమా రేంజ్‌ను వరల్డ్ మొత్తానికి పరిచయం చేసిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడన్న విషయం తెలిసిందే.

Update: 2024-11-03 22:30 GMT
17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో ప్రభాస్.. సెట్టయినట్లేనా?
  • whatsapp icon

తెలుగు సినిమా రేంజ్‌ను వరల్డ్ మొత్తానికి పరిచయం చేసిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడన్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో అతడు కూడా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ హీరో.. ఇండియన్ సినిమాను శాసించే దిశగా సాగిపోతోన్నాడు. ఇందులో భాగంగానే వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలోనే ‘సలార్: సీజ్‌ఫైర్’తో వచ్చి మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఊపులోనే ఈ ఏడాదిలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చేశాడు. ఇది 1100 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లను సాధించి పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందించబోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

‘స్పిరిట్’ మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇది సిన్సియర్ కాప్ స్టోరీతో రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. అదే సమయంలో అతడు ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌ను దాదాపుగా పూర్తి చేయడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా మొదలెట్టాడు. ఇప్పుడు ఈ మూవీ కాస్టింగ్ మీద సందీప్ వంగా ఫోకస్ చేసినట్లు తెలిసింది.

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించే ‘స్పిరిట్’ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును దర్శకుడు ఆమెకు వినిపించాడట. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. గతంలో అంటే 2007లో ప్రభాస్, నయనతార ‘యోగి’ మూవీలో జంటగా కనిపించిన విషయం తెలిసిందే.

సీరియస్ పోలీస్ స్టోరీతో రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్‌తో నయనతార జోడీ కడుతుందన్న వార్త ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Tags:    

Similar News