ఎన్టీఆర్‌తో చేయాలంటే ఆ మాత్రం ప్రిపరేషన్ తప్పదు
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత చేస్తున్న మూవీ 'వార్ 2'. భారీ అంచనాల నడుమ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న విషయం తెల్సిందే. అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వార్ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ రోషన్ పై చేయి కావచ్చు.. కానీ డాన్స్ విషయంలో కచ్చితంగా ఎన్టీఆర్‌ను మ్యాచ్ చేయాలి అంటే హృతిక్ రోషన్ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఇటీవల ఒక మీడియా చిట్ చాట్‌లో స్వయంగా హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. తాను వార్ 2 లోని ఒక పాట కోసం రెడీ అవుతున్నాను. ఆ పాటలో డాన్స్ చేయడం కోసం నేను ఎక్కువగా ప్రిపరేషన్‌లో ఉన్నాను అన్నాడు.
ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే ఆ పాటలో తాను ఎన్టీఆర్ తో డాన్స్ చేయబోతున్నాను అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. దాంతో సినిమా గురించి మరోసారి చర్చ ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ తో డాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినీ స్టార్స్ లో గొప్ప డాన్సర్స్ జాబితా తీస్తే అందులో కచ్చితంగా ముందు వరుసలో ఎన్టీఆర్ ఉంటారు. హృతిక్ రోషన్ సైతం గొప్ప డాన్సర్ అనడంలో సందేహం లేదు. కానీ ఆయన ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలి అంటే కచ్చితంగా ఎక్కువ హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
వార్ 2 సినిమా విడుదల ఈ ఏడాది ఆగస్టులో ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం మెల్లగా షూటింగ్ జరుగుతున్న కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ నెలలోనే మూడో వారంలో కర్ణాటకలో ఎన్టీఆర్ నీల్ మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ తర్వాత విదేశాల్లో సినిమా షూటింగ్ ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది బిజీ బిజీగా సినిమాలు చేయబోతున్నారు, మరో వైపు దేవర 2 సైతం లైన్‌లో ఉంది.