ఫ్యామిలీతో బర్త్ డే వేడుకల్లో క్రేజీ హీరోయిన్..!
హీరోయిన్ గా చేసే కొందరు భామలు కొన్ని పాత్రలే చేస్తానని అంటుంటారు. నెగిటివ్ పాత్రలకు అసలు ఛాన్స్ ఇవ్వరు. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశం ఎలాంటిదైనా సరే అది వాడుకోవాలని అనుకుంటారు.
హీరోయిన్ గా చేసే కొందరు భామలు కొన్ని పాత్రలే చేస్తానని అంటుంటారు. నెగిటివ్ పాత్రలకు అసలు ఛాన్స్ ఇవ్వరు. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశం ఎలాంటిదైనా సరే అది వాడుకోవాలని అనుకుంటారు. అలాంటి వారిలో రాధిక అదేనండి నేహా శెట్టి ఉంటుంది. డీజే టిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నేహా శెట్టి ఐదేళ్ళ క్రితమే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇన్నాళ్లకు అమ్మడి కెరీర్ ట్రాక్ లోకి వచ్చింది.
2016 లోనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన నేహా శెట్టి 2018లో ఆకాష్ పూరీ చేసిన మెహబూబా సినిమాలో నటించింది. ఆ సినిమా ఫెయిల్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తున్న నేహాకి డీజే టిల్లు మంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలో రాధిక పాత్ర హైలెట్ అవడంతో ఆమెను ఇప్పటికీ చాలామంది రాధిక అని పాత్ర పేరుతో పిలుస్తుంటారు.
డీజే టిల్లు తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలు చేసిన నేహా శెట్టి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. కన్నడ నుంచి వచ్చి తెలుగు ఆడియన్స్ ని అలరించే హీరోయిన్స్ లో నేహా శెట్టి ఒకరు. అయితే ఎప్పుడు తన ఫోటో షూట్స్ తోనే ఫాలోవర్స్ ని అలరించే అమ్మడు రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీని కూడా పరిచయం చేసింది. డిసెంబర్ 5న జరిగిన నేహా శెట్టి పుట్టినరోజు వేడుకలో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది అమ్మడు.
నేహా పేరెంట్స్ తో పాటుగా సిస్టర్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేహాకి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ కూడా బర్త్ డే విషెస్ అందించారు. నేహా తండ్రి ఒక బిజినెస్ మెన్ కాగా మదర్ కూడా డెంటిస్ట్ అని తెలుస్తుంది. నేహా రెగ్యులర్ గా తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఖుషి చేస్తుంది. బర్త్ డే ఫోటోలతో వారిని మరింత ఎంటర్టైన్ చేసింది అమ్మడు. రీసెంట్ టైం లో తెలుగులో పాపులారిటీ సంపాదించిన వారిలో నేహా శెట్టి ఒకరు. మొదట్లో కాస్త తడబడ్డా ఇప్పుడు అమ్మడు వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా అటు నటనతో పాటుగా గ్లామర్ షోలో కూడా ఎక్కడ తగ్గేదిలేదు అంటుంది నేహా శెట్టి. తప్పకుండా అమ్మడికి రానున్న రోజుల్లో ఇంకా గొప్ప అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.