సుకుమార్ కి అసిస్టెంట్ గా పాపులర్ న్యూస్ యాంకర్?

పుష్ప2' సినిమాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్టర్స్ వార్తలను నివేదించే విధానానికి సంబంధించి దేవి నాగవల్లి ఇన్ ఫుట్స్ తీసుకునేందుకు సుకుమార్ ఆమెను పుష్ప 2 సెట్స్ కి పిలిచారట.

Update: 2024-01-02 16:13 GMT

సాధారణంగా సినిమా మీడియాలో పనిచేసే చాలా మంది వ్యక్తులు రచయిత, దర్శకుడు లేదా నటీనటులు కావాలని ఏదో ఆశతో తరచుగా ఫిలిం ఇండస్ట్రీకి వస్తుంటారు. మీడియాలో పనిచేస్తున్న సమయంలో సినిమా అవకాశాలు వస్తే మళ్లీ ఆ వైపుకు వెళ్ళరు. మరి కొందరైతే మీడియాలో పనిచేసే కొంత ఫేమ్ వచ్చాక సినిమా ఇండస్ట్రీ వైపుకు వెళుతుంటారు. తాజాగా ప్రముఖ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి సైతం ఇదే దారిలో వెళుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏంటంటే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దేవీ నాగవల్లిని 'పుష్ప 2' సైట్స్ కి ఆహ్వానించినట్లు తెలిసింది. 'పుష్ప2' సినిమాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్టర్స్ వార్తలను నివేదించే విధానానికి సంబంధించి దేవి నాగవల్లి ఇన్ ఫుట్స్ తీసుకునేందుకు సుకుమార్ ఆమెను పుష్ప 2 సెట్స్ కి పిలిచారట. ఈ క్రమంలోనే దేవీ నాగవల్లి 'పుష్ప2' కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేందుకు ఎలాంటి మెలకువలు అవసరమో ఈ సందర్భంగా సుకుమార్ ని అడిగి తెలుసుకుందట దేవి నాగవల్లి.

అంతేకాదు సుకుమార్ సైతం ఆమెకు సమయం దొరికినప్పుడల్లా 'పుష్ప 2' కోసం వర్క్ చేసేందుకు అనుమతించినట్లు వార్తలు వినిపిస్తుంది. ప్రస్తుతం దేవి నాగవల్లి 'పుష్ప 2' సెట్స్ లో మంచి పనితనం కనబరుస్తుందని త్వరలోనే ఆమె తెలుగు సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయొచ్చని కూడా అంటున్నారు. సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేందుకు అనుమతి ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు.

ఇప్పటివరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన పలువురు దర్శకులుగా తమ ప్రతిభను చాటారు. 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు, 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రీకాంత్ విస్సా.. వీళ్లంతా సుకుమార్ శిష్యులే. వీళ్ళలాగే రాబోయే రోజుల్లో దేవీ నాగవల్లి కూడా సినిమాల్లో రాణిస్తుందేమో చూడాలి.

ఇక 'పుష్ప2' విషయానికొస్తే.. సుకుమార్ పార్ట్ వన్-1 ని మించేలా పార్ట్-2 ని తెరకెక్కిస్తున్నారు. కాస్టింగ్, మేకింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు మైత్రి నిర్మాతలు కూడా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాని ని గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News