ప్రీతీజింటా మాజీ ప్రియుడు- షారుక్ మధ్య మాటల యుద్దమా?
ఐపీఎల్ ప్రాంచైజీలతో బీసీసీ ఐ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారినట్లు కనిపిస్తుంది
ఐపీఎల్ ప్రాంచైజీలతో బీసీసీఐ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారినట్లు కనిపిస్తుంది. ఈ సమావేశంలో అన్ని ప్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కో -ఓనర్ నెస్ వాడియాతో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు వార్త లొస్తున్నాయి. రిటైన్డ్ లిస్ట్ ఆటగాళ్ల పరిమితిని పెంచకూడదని పంజాబ్ కింగ్స్ పేర్కొనడంతో షారుక్ ఖాన్ మండిపడినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కొన్నిప్రాంచైజీలు ఒక కూటమిగా..మరికొన్ని ప్రాంచైజీలు మరో కూటమిగీ ఏర్పడాయి. కేకేఆర్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు మెగా వేలానికి వ్యతిరేకించాయి. 2025 సీజన్‌కు ముందు మినీ వేలాన్ని నిర్వహించాలని పట్టుబట్టాయి. అంతేగాక రిటైన్డ్ లిస్ట్, రైట్ టూ మ్యాచ్ కార్డ్‌ను ఎక్కువ సంఖ్యలో ఉండాలని డిమాండ్ చేశాయి.
నాలుగు నుంచి అయిదేళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని సూచించాయి. మూడేళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహించడం వల్ల ఆటగాళ్లపై పెట్టుబడి నిరుపయోగంగా మారుతుందని వాదించాయి.
మరోవైపు పంజాబ్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలం నిర్వహించాల్సిందే అని పట్టుబట్టాయి. రిటైన్డ్ లిస్ట్- ఆర్‌టీఎమ్ సంఖ్యను పెంచడానికి ఈ ఫ్రాంచైజీలు ఒప్పుకోలేదు. దీంతో నెస్ వాడియా-షారుక్ ఖాన్ మధ్య కాసేపు మాటల యుద్దం సాగినట్లు వార్తలొస్తున్నాయి. ఇరువురు మధ్య కాస్త సీరియస్ గానే వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు వినిపిస్తుంది.
సమావేశం అనంతరం షారుక్ తో జరిగిన గొడవ గురించి నెస్ వాడియా స్పందించాడు. `'షారుక్ ఖాన్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అతనితో శత్రుత్వం లేదు. ప్రతి ఒక్కరి తమ అభిప్రాయాలు ఉంటాయి. అయితే అంతిమంగా అందరికి మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి` అని తెలిపారు. దీంతో షారుక్ కూడా శాంతిచినట్లు తెలుస్తోంది.