మిర్రర్ అడ్డు పెట్టి ఈ సెటైర్లు ఏంటి నియా
తాజాగా మరోసారి సొగసరి ఇన్ స్టాలో చెలరేగింది
'బిగ్ బాస్' ఫేం నియాశర్మ నెట్టింట సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్లతో సెగలు పుట్టిస్తుంది. వృత్తి ధర్మాని అన్యాయం చేయకూడదంటూ వారంతంలో తప్పకుండా తన నుంచి కొన్ని సెన్షేషన్స్ ఉండేలా చూసుకుంటుంది. ఆ రకంగా అమ్మడు నిరంతరం యువత నోళ్లలో నానుతుంది. సినిమా ఛాన్సులు లేకపోయినా అంత ఫాలోయింగ్ ఎలా సాద్యమైంది? అంటే కేవలం తనలో వ్యక్తిగత పెర్పార్మెన్స్ అన్నది కారణం.
తాజాగా మరోసారి సొగసరి ఇన్ స్టాలో చెలరేగింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో తళుకులీనింది. తనదైన మార్క్ గ్లామర్ ఎలివేషన్ ఇస్తూ నాకెవ్వరు సాటి అనిపించింది. అమ్మడు ముస్తాబైన విధానం.. అప్పిరియన్స్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటున్నాయి. ఎదురుగా అద్దం చూసుకుంటోన్న ఫోజులో? కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈఫోటోపై నియా ఓ కామెంట్ పోస్ట్ చేసి అలెర్ట్ చేసింది.
'నేను వారి ఫిర్యాదుల కంటే అద్దం లో చూసుకోవడంపైనే దృష్టి పెట్టాను` అని అర్ధం వచ్చేలా రాసుకొచ్చింది. అంటే పరోక్షంగా తనపై వచ్చిన ఫిర్యాదులపై ఇలా ఘాటు రిప్లై ఇవ్వడం అన్న మాట. నియా అందాల్ని పొగిడేస్తూ కింద కామెంట్ బాక్సులో రకరకాల కామెంట్లు దర్శనమిస్తున్నాయి. కానీ నియా వాటిని చదవడం కన్నా..తన ముందున్న అద్దంలో అందాన్ని చూసుకోవడంలో బిజీ అయ్యాను అంటోంది.
నియా కెరీర్ సంగతి చూస్తే! ఈ ఫాలోయింగ్ అంతా ఇన్ స్టాకే పరిమితం. నటిగా మాత్రం అమ్మడు ఇప్పటికీ బిజీ కాలేదు. హిందీలో రకరకాల షోలు చేయడం మినహా వెండి తెరపై అబ్బురు పరించింది లేదు. ఇక్కడ నియాకి ఇక్కడ టైమ్ కూడా సహకరిచడం లేదు. శక్తి వంచన లేకుండా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా? పనవ్వడం లేదు. ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సరైన అవకాశం రావడం లేదు.