ఈ హీరోయిన్ మొగుడు చాల రొమాంటిక్ గురూ!
ప్రియాంక నల్లని స్కర్ట్ - లెదర్ జాకెట్‌తో రేసీ క్రాప్ టాప్‌లో హాట్‌గా కనిపిస్తోంది. నిక్ కచేరీ కోసం పూర్తిగా తెల్లని దుస్తుల్లో రెడీ అయ్యాడు.
హాట్ ఫోటోషూట్లతో నిరంతరం వేడెక్కించడం ప్రియానిక్ జంటకు కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి అలాంటి ఒక స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాలంలో హీటెక్కిస్తోంది. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జోనాస్ బ్రదర్స్ కచేరీకి సిద్ధమవుతున్న వేళ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌కు చీర్‌లీడర్‌గా మారింది. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోషూట్ లో పీసీ మూడ్ యూనిక్ లుక్ ఆకర్షించాయి. ప్రియాంక నల్లని స్కర్ట్ - లెదర్ జాకెట్‌తో రేసీ క్రాప్ టాప్‌లో హాట్‌గా కనిపిస్తోంది. నిక్ కచేరీ కోసం పూర్తిగా తెల్లని దుస్తుల్లో రెడీ అయ్యాడు. ప్రియాంక తన భర్తతో కలిసి హాట్ గా పోజులిచ్చింది. ఈ ఫోటోలకు ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. "మీరు ఒక అయస్కాంతం @ నిక్ జోనాస్ .. నా భర్త అయినందుకు చాలా అదృష్టవంతురాలిని. అద్భుతమైన పర్యటన ప్రారంభమైనందుకు అభినందనలు. మీరంతా గొప్ప ప్రయాణంలో ఉన్నారు! లెట్స్ హూ! గ్రేట్ జాబ్ JB బ్యాండ్.. టీమ్‌కి శుభాకాంక్షలు" అని వ్యాఖ్యానించింది.
నిజానికి జోనాస్ బ్రదర్స్ కచేరీకి సిద్ధమవుతున్న వేళ ప్రియాంక చోప్రా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె జోనాస్ బ్రదర్స్‌ని చూసేందుకు ఉత్సాహపరిచేందుకు స్టాండ్స్‌లో తన అత్తమామలతో కలిసి విచ్చేసింది. అయితే కచేరీలో జోనాస్ బ్రదర్స్ అద్భుత ప్రదర్శనకు కదిలిపోయి కన్నీళ్లతో ఎమోషనల్ అయింది. అంతేకాదు.. 2021లో నిక్ తన ఆల్బమ్‌లలో ఒకటి అంతగా ఆదరణ దక్కించుకోని సందర్భంలో తాను తీవ్ర కలతలో ఉండగా భార్య ప్రియాంక చోప్రా తనకు ఎలా మద్దతు ఇచ్చింనే దానిపై నిక్ జోనాస్ బహిరంగ వేదికపై మాట్లాడారు. "స్పేస్‌మ్యాన్ ఆల్బమ్ విడుదలైన తర్వాత నా భార్య నాకు అద్భుతమైన మద్దతును ప్రేమను ఇచ్చింది. నా ఆల్బమ్ గురించి నేను చాలా గర్వపడ్డాను. కానీ అది నేను కోరుకున్నంతగా జనంలోకి వెళ్లలేదు. బాగా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే నేను ఆల్బమ్ కోసం చాలా హార్డ్ గా కష్టపడ్డాను.. కానీ ఫలితం తారుమారైంది.. అని గుర్తు చేసుకున్నాడు. తన కష్టకాలంలో పీసీ అండదండలకు మురిసిపోయాడు. పీసీ సిటాడెల్ సిరీస్ తర్వాత హిందీ చిత్రసీమలో నటించేందుకు సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే.