అందాల నిధి 2025 స్పెషల్‌.. పవన్‌, ప్రభాస్‌లతో సందడి

నిధి అగర్వాల్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మొదటిది పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'.

Update: 2024-12-30 10:20 GMT

నాగ చైతన్యతో కలిసి 'సవ్యసాచి' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఆ సినిమా ఫలితం నిరాశ కలిగించినా వెంటనే అఖిల్‌ అక్కినేనితో మిస్టర్ మజ్ను సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నిధి అగర్వాల్‌ నటించి తన అందంతో పాటు నటనతో మెప్పించింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో అతి పెద్ద రెండు తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది ఈమె కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ హీరోయిన్‌గా మారబోతుంది.

నిధి అగర్వాల్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మొదటిది పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో ప్రారంభం అయినా పవన్ రాజకీయాలతో, పరిపాలనతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చి చివర్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2025 సమ్మర్‌లో హరిహర వీరమల్లు సినిమాతో నిధి అగర్వాల్‌ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఆమె ఫ్యాన్స్‌తో పాటు, పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

హరిహర వీరమల్లు సినిమాతో పాటు నిధి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ 'రాజాసాబ్‌'. పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్‌ పోషిస్తున్న పాత్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయలేదు. అయితే కచ్చితంగా రాజాసాబ్‌లో నిధి అందాలతో పాటు నటనతోనూ మెప్పిస్తుంది అనే నమ్మకంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో 2025లో నిధి అగర్వాల్‌ చాలా గట్టిగానే వినిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కొన్ని కారణాల వల్ల గత రెండేళ్లుగా సినిమాలతో రాలేక పోయిన నిధి అగర్వాల్‌ ఇకపై వరుసగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వచ్చే విధంగా ప్లాన్‌ చేసుకుంటుంది. 2025లో అన్ని అనుకున్నట్లుగా జరిగితే, హరిహర వీరమల్లు హిట్‌ అయ్యి మంచి పేరును సొంతం చేసుకుంటే మూడు నాలుగు సినిమాలకు సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థాయిలో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది ఆమెకు చాలా స్పెషల్‌ మాత్రమే కాకుండా ఆమె సినిమాలతో అన్ని భాషల్లోనూ సందడి చేసే అవకాశం ఉంటుంది. 2025 ఇంకా ఎలా ఆమెకు స్పెషల్‌గా నిలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News