చీరలో నిహారిక స్టన్నింగ్!
తాజా ఫొటోషూట్‌లో బ్లూ కలర్ శారీలో బ్లౌజ్ లేకుండా చీరలో కనువిందు చేసింది నిహారిక.
గత కొద్ది రోజులుగా నిహారిక కొణిదెల గ్లామరస్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి అయితే భిన్నమైన గెటప్స్‌ను ట్రై చేస్తూ వేదాంతాలను క్యాప్షన్లుగా రాసుకొస్తోంది. తాజాగా మరో ఫొటోషూట్‌లో బ్లౌజ్ లేకుండా చీర ధరించి మత్తు పోజులిచ్చింది. అవి నెటింట బాగా చక్కర్లు కొడుతున్నాయి.
వివరాళ్లోకి వెళితే.. ప్రస్తుతం నిహారిక కుటుంబంలో పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి -వరుణ్ తేజ్‌ల వివాహం నవంబర్ 1న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనుల్లో నిహారిక కూడా కాస్త బిజీగా ఉంటూనే ఈ ఫొటోషూట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజా ఫొటోషూట్‌లో బ్లూ కలర్ శారీలో బ్లౌజ్ లేకుండా చీరలో కనువిందు చేసింది నిహారిక. సైడ్ అండ్ ఫ్రంట్ యాంగిల్లో పోజులిచ్చింది. రెండు జడలు వేసుకుని, ముక్కుపుడుక, మెడలో నెక్లెస్ ధరించి రెట్రో లుక్‌లో ఆకట్టుకుంది. విశ్వ సృష్టికర్త గాడెసెస్ కూష్మాడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను. ఈ నీలి రంగు సమస్త సృష్టి, ఇందులో ఉన్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. అని రాసుకొచ్చింది.
ఈ పిక్స్‌ను నెటిజన్లు, మెగా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరూ అందంగా, జై మాతాజీ అంటూకామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం బిక్షు యాదవ్ ముక్కుపుడుకలా ఉంది, ఎవరి కోసం చేస్తున్నావ్ ఇదంతా అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి కథనాయికగా సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసిన నిహారిక... ఒక మనసు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సహా పలు సినిమాల్లో నటించింది. అవి అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి భర్తతో కలిసి చిత్రాలను కూడా నిర్మించింది. కానీ ఆ తర్వాత ఆమె వివాహ జీవితం సాఫీగా సాగలేదేమో క్లారిటీ లేదు కానీ.. విడాకులు అయితే తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది.