బిగ్ బాస్ 8 : నిఖిల్ వర్సెస్ గౌతం.. గ్రాఫ్ పడిపోయిందా..?
ఐతే ఈసారి సోమవారం నామినేషన్స్ లో ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగతా అందరు ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 మరో రెండు వారాలు ముగుస్తుంది అనగా కంటెస్టెంట్స్ అంతా తమ బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈసారి సోమవారం నామినేషన్స్ లో ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగతా అందరు ఉన్నారు. ఆడియన్స్ వీరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి ఏ ఆరుగురిని ఫైనల్ వీక్ కి తీసుకెళ్తారో చూడాలి. ఐతే ఇక చివరి వారం నామినేషన్స్ అయితే ఎలాంటి గొడవ లేకుండా జరిగాయి అనుకునేలోగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్ వీక్ కి అర్హత కాదో వారిని ఎంపిక చేయమని అంటాడు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్ పేరు చెప్పగా గౌతం నిఖిల్ ని సెలెక్ట్ చేశాడు. ఏదైనా డిస్కషన్ వస్తే చాలు అంతెత్తున గొంతు పెంచుకుని అరవడం గౌతం కి అలవాటే. నిఖిల్ కూడా ఈసారి తగ్గేదేలేదు అన్నట్టు మాట్లాడాడు. ఐతే నిఖిల్ ఆట గురించి చెబుతూ గౌతం నువ్వు యష్మిని వాడుకున్నావ్ అన్న మాట అన్నాడు. ఐతే వాడుకోవడం అంటే ఆమె అడ్డు పెట్టుకుని అని గౌతం అర్థం. కానీ నిఖిల్ ఆ మాట అన్న గౌతం మీద ఫైర్ అయ్యాడు. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు వదలొద్దని అన్నాడు.
ఐతే గౌతం తను ఎలాగు టైటిల్ రేసులో ఉన్నాననే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అసలు తనకు సంబంధం లేని విషయాల మీద అవతల వారిని టార్గెట్ చేస్తున్నాడు. గౌతం నిఖిల్ ని వేరే విధంగా అయినా మాట్లాడి వాదించవచ్చు. కానీ యష్మి పేరు తీసుకు రాకుండా ఉండాల్సింది. యష్మిని వాడుకున్నావ్ అని అనడం కరెక్ట్ కాదు. ఐతే ఇన్నాళ్లు నిఖిల్ తో పాటు గౌతం కూడా టైటిల్ రేసులో ఉండగా ఈ వాదన వల్ల గౌతం గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది.
ఫ్యామిలీ వీక్ ఇంకా బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఇచ్చిన ఇన్ పుట్స్ తో తాను టాప్ 2లో ఉన్నానని కనిపెట్టిన గౌతం అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడుతుంటాడు. ఐతే తను కావాలని గొడవ పెట్టుకుంటున్నాడని అర్ధమవుతుంది. యష్మిని నిఖిల్ వాడుకున్నాడు అనే మాటకు విష్ణు ప్రియ, రోహిణి కూడా గౌతం ని తప్పుబట్టారు. మొత్తానికి నిఖిల్ గౌతం మధ్య జరిగిన ఈ గొడవ నిఖిల్ కి పాజిటివ్ గా మారిందని చెప్పొచ్చు.