ఆ సినిమాల పరిస్థితి ఏంటి రాజా..?
ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ గా రాబోతున్నాయి. కార్తికేయ 2 తో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి ఈ రెండు సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు.
కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కార్తికేయ 2 వచ్చిన 3 నెలలకే 18 పేజీస్ సినిమాగా ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత స్పై అంటూ ఒక మూవీని వదిలాడు. ఆ సినిమా రిలీజ్ టైం లో నిఖిల్ నిర్మాతల మధ్య ఫైట్ తెలిసిందే. సినిమా సరిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగకుండానే రిలీజ్ చేశారని నిఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే నిఖిల్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. అందులో ఒకటి రాం చరణ్ నిర్మిస్తున్న ద ఇండియా హౌస్ కాగా.. మరోటి స్వయంభు. ద ఇండియా హౌస్ సినిమా ప్రీ ఇండిపెండెంట్ మూవీగా రాబోతుంది. సినిమాను రాం వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటబోతుందని చెప్పొచ్చు.
ఇక మరోపక్క స్వయంభు అంటూ మరో పీరియాడికల్ మూవీతో వస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి, అదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను భువన్ సాగర్ భారీ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ గా రాబోతున్నాయి. కార్తికేయ 2 తో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి ఈ రెండు సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమాల అనౌన్స్ మెంట్ తర్వాత సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. స్వయంభు కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి అంచనాలు పెంచగా ది ఇండియా హౌస్ సినిమా అనౌన్స్ మెంట్ రోజు ఒక టీజర్ ని వదిలారు. ఈ సినిమాలతో నిఖిల్ మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తాడా లేదా అన్నది చూడాలి.