బికినీ బీచ్ లో చెల‌రేగిపోతున్న ఈ బ్యూటీ ఎవ‌రు?

హాట్ బ్యూటీ నిఖిత‌ ఒక కొలనులో కూర్చొని పోజులిచ్చింది. బీచ్‌లో సుందరమైన దృశ్యం ఈ ఫోటోల్లో ఎలివేట్ అవుతోంది.

Update: 2023-08-21 15:18 GMT

లస్ట్ స్టోరీస్-కబీర్ సింగ్-ది బిగ్ బుల్-గోల్డ్ వంటి చిత్రాలలో న‌టించింది నికితా దత్తా. ఈ బ్యూటీ హాట్ లుక్స్ పెర్ఫామెన్స్ కి యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ భామ త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కేవ‌లం న‌టిగానే కాదు సోష‌ల్ మీడియా క్వీన్ గాను నిఖిత‌కు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తోను నిరంత‌రం యూత్ కి ఈ భామ స్పెష‌ల్ ట్రీటిస్తోంది. తాజాగా అద్భుతమైన బీచ్ వెకేష‌న్ ఫోటోల‌తో ఇన్ స్టాను మండించింది.


నికితా మాల్దీవుల వెకేష‌న్ నుండి త్రోబాక్ ఫోటోల స్ట్రింగ్‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోల్లో నలుపు రంగు స్లీవ్‌లెస్ బాడీకాన్ స్విమ్‌సూట్‌లో కనిపించింది. హాట్ బ్యూటీ నిఖిత‌ ఒక కొలనులో కూర్చొని పోజులిచ్చింది. బీచ్‌లో సుందరమైన దృశ్యం ఈ ఫోటోల్లో ఎలివేట్ అవుతోంది. ఇక ఈ ఫోటోల బంచ్ లో ఒక ఫోటోలో ప్ర‌శాంతంగా సంతోషంగా అన్నిటినీ మ‌రిచిపోయి నీటితో ఆడుకుంటూ క‌నిపించింది. నిఖిత ఈ పోస్ట్‌కి అంద‌మైన క్యాప్షన్ ఇచ్చింది.

''జీవితంలో ఎల్లప్పుడూ బీచ్‌లో సూర్యాస్తమయాలను చూడటం ఉత్తమం. అలాగే కొలనులో కూర్చొని ఆట‌లాడుకోవ‌డం బావుంటుంది #Throwback #Maldives #IndianOcean'' అని వ్యాఖ్య‌ను జోడించింది. నిఖిత‌ హాట్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం వెబ్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోల‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హాట్‌నెస్ ఓవ‌ర్ లోడెడ్ అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా.. ఫైర్ h tu .. వేడి నల్ల మిరియాలు.. కాటిల్ అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల‌ను జోడించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నిఖిత చివరిగా 'రాకెట్ గ్యాంగ్' చిత్రంలో తానియాగా కనిపించింది. మ్యూజికల్ సూపర్‌నేచురల్ కామెడీ డ్రామా చిత్ర‌మిది. ఈ చిత్రంలో అమర్‌బీర్‌గా ఆదిత్య సీల్- జాసన్ థామ్ నటించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ 'హర్ బచ్చా హై రాకెట్' పాటలో ప్రత్యేక పాత్రలో (ఏంజెల్‌గా) కనిపించాడు. నీరజ్ పాండే రూపొందించిన 'ఖాకీ: ది బీహార్ చాప్టర్' వెబ్ సిరీస్‌లో కూడా నికితా కనిపించింది. ఇందులో కరణ్ టాకర్ (ఐపీఎస్ అమిత్ లోధాగా) ప్రధాన పాత్రలో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో నిఖిత అమిత్ భార్య తనూ లోధా పాత్రను పోషించింది.

Tags:    

Similar News