ఈ గ్రనేడ్ దాడేంటి అమ్మడు?
తాజాగా దీపావళి రోజున పటాస్ లా పేలాల్సిన అమ్మడు ఏకంగా గ్రనేడ్లనే దించేసింది. పటాస్ సౌండ్ తక్కువ..గ్రనేడి దాడి అయితే బలంగా ఉంటుంది?
యాంకర్ కమ్ యాక్టరెస్ నిఖితా శర్మ ఇన్ స్టాని ఏ రేంజ్ లో హీటెక్కిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో ఆ వేడి రెట్టింపు అయింది. కొత్త కొత్త ఫోజులతో కాక పుట్టిస్తుంది. బికినీలు..స్విమ్ షూట్ లు..టూపీస్ లు... చిట్టిపొట్టి దుస్తులు బోరింగ్ అనిపించేలా నిఖితా వడ్డన మాములుగా లేదు. అమ్మడు కొలతలకు తగ్గ డిజైనర్స్ లో అగ్గిరాజేయడం అంతటా చర్చనీయాంశమే. అందులోనూ టార్గెటెడ్ గా ఈ మధ్య ఎక్కువగా ఎరుపు రంగు దుస్తుల్లో ప్రత్యేకంగా ఫోకస్ అవుతుంది.
మొన్న ఎర్ర చీర కట్టి అందులో అందాలన్నీ ధారాళంగా దారబోసింది. అటుపై అదే వర్ణం డిజైనర్ దుస్తుల్లో అంతకంతకు మంటలు పుట్టించింది. తాజాగా దీపావళి రోజున పటాస్ లా పేలాల్సిన అమ్మడు ఏకంగా గ్రనేడ్లనే దించేసింది. పటాస్ సౌండ్ తక్కువ..గ్రనేడి దాడి అయితే బలంగా ఉంటుంది? ఎక్కడిక్కడ సమూలంగా ఛిద్రం అవుతాయి అన్నట్లే నెట్టింట ఈ ఫోటో వదిలింది.
ఇదిగో ఇక్కడిలా ఎరుపు రంగు లెహగా దుస్తుల్లో కైపెక్కించే అందాలతో విరుచుకుపడింది. ఎద అందాల్ని ఎలా ప్రోజక్ట్ చేస్తే! ఫోకస్ అవుతాయా పక్కాగా అదే కోణంలో వదిలింది. నాభి అందాల్ని సైతం అదే రీతున హైలైట్ చేసింది. ఇల్లాంతా బంత్తి పువ్వులు తో అలంకరించి ఆ మధ్యలో ఎరుపు బంతి పువ్వులా నిలబడి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు అదే తీరున హాట్ కామెంట్లతో ఎటాకింగ్ కి దిగారు.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏదర్శక నిర్మాత ఎంకరేజ్ చేయలేదు. దీంతో బుల్లి తెరతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అక్కడ మాత్రం బాగానే సక్సెస్ అయింది. చాలా సీరియళ్లు..షోస్ చేస్తుంది.