హనుమాన్ నిర్మాత.. రాబోయే ప్రాజెక్టులు గట్టిగానే..

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సంవత్సరం 'హనుమాన్' అద్భుత విజయాన్ని సాధించింది.

Update: 2024-05-28 07:49 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సంవత్సరం 'హనుమాన్' అద్భుత విజయాన్ని సాధించింది. సంక్రాంతి భరిలో పోటీగా వచ్చిన ఈ సినిమా రిస్క్ లోనే బిగ్ జాక్ పాట్ చూపించింది. దేశవ్యాప్తంగా డైరెక్టర్ నిర్మాత వర్క్ ను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ విజయంతో మంచి లాభాలు పొందారు. ఇప్పుడు ఆయన సూపర్ స్పీడులో కొనసాగుతూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.

మొన్నటివరకు ఒక లెక్క ఇప్పుడు మరొక లెక్క అనేలా ఆయన సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త వారితో సినిమాలు చేస్తూనే మరోవైపు టాలెంటెడ్ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. నిరంజన్ రెడ్డి తన తదుపరి చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారు.

ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా అవుతుందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇక త్వరలోనే అఫీషియల్ క్లారిటీ తో సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

నిరంజన్ రెడ్డి మరో ప్రాజెక్ట్‌ను నితిన్‌తో చేస్తున్నాడు. ఈ సినిమాను 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు 80 కోట్లు ఉండనుందట. నితిన్ ప్రస్తుతం తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తిచేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అతని కెరీర్ లో కూడా ఇది బిగ్ బడ్జెట్ మూవీ కానుంది. అలాగే నిరంజన్ రెడ్డి 'నా సామి రంగ' ఫేమ్ విజయ్ బిన్నితో కూడా పాన్-ఇండియన్ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో నాగార్జున ప్రధాన హీరోగా చేయవచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. నిరంజన్ రెడ్డి యువ నటులు నాగ చైతన్య మరియు వరుణ్ తేజ్‌లకు కూడా అడ్వాన్సులు చెల్లించారు. అతని ప్రొడక్షన్ హౌస్ 'ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌' కొన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టింది.

ఈ ప్రొడక్షన్ హౌస్ రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. నిరంజన్ రెడ్డి ప్రస్తుతం నిర్మాతగా తన కెరీర్‌ను మరింత శక్తివంతంగా మార్చుకుంటున్నారు. తన సమర్పణలో వచ్చే సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి అనేలా అడుగులు వేస్తున్నారు. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News