కంగువ ఎడిటర్ అనుమానాస్పద మృతి..!
కంగువ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన నిషాద్ యూసఫ్ మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు. నవంబర్ 14న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా చేశారు. ఐతే రిలీజ్ దగ్గర పడుతుండటంతో సూర్య అండ్ టీం కంగువ కోసం వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు. ఐతే కంగువ సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ తగిలింది.
కంగువ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన నిషాద్ యూసఫ్ మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కేరళకు చెందిన అతను 2 గంటల టైం లో మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. 43 ఏళ్ల నిషాద్ యూసఫ్ పనం పిల్లై నగర్ లోని తన నివాసం లో విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిషాద్ మృతికి కారణాలు ఏంటన్నది విచారణ నిర్వహిస్తున్నారు.
కేరళ ఫిల్మ్ ఫేడరేషన్ ఎంప్లాయీస్ కూడా నిషాద్ యూసఫ్ మృతిని కన్ఫర్మ్ చేశాయి. నిషాద్ యూసఫ్ మలయాళ, తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. మలయాళంలో వచ్చిన థల్లుమల, ఉండ, వన్ సినిమాలతో పాటు సౌది వెళ్లాక, అడివోస్ అమిగోస్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. సూర్య కంగువ కోసం దాదాపు రెండేళ్లుగా పనిచేస్తున్నారు నిషాద్ యూసఫ్. మరి అతని మృతికి కారణాలు ఏంటి. సినిమా రిలీజ్ ముందే ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి. కంగువ సినిమా టీం ఓ అతనికి ఏదైనా గొడవలు ఉన్నాయా. కంగువ అతని ఎడిటింగ్ పోషన్ కంప్లీట్ అయ్యిందా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.
సినిమా రిలీజ్ ముందు చిత్ర యూనిట్ లో ఒకరు దూరమైతే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది. నిషాద్ యూసఫ్ మరణం కూడా కంగువ సినిమా మీద పడుతుంది. కంగువ ఎడిటర్ మృతిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. సినీ పరిశ్రమలో ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతి చెందినందుకు పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఐతే నిషాద్ యూసఫ్ మృతికి కారణాలను కనిపెట్టేందుకు పోలీసులు సీరియస్ దర్యాప్తు మొదలు పెట్టారు.
సినిమా రిలీజ్ కోసం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న కంగువ టీం కి ఎడిటర్ మృతి వార్త షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. సమస్య ఏదైనా సరే నిషా మృతి వల్ల కంగువ టీం ఎంతోకొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.