దేశ‌మంతా శ్రీరామస్మ‌ర‌ణ వేళ తివారీ రామాయ‌ణం!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా 'రామాయ‌ణ్' ని తెర‌కెక్కి స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-23 10:39 GMT

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా 'రామాయ‌ణ్' ని తెర‌కెక్కి స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భారీ కాన్సాన్ పైచిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి...రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్..హ‌నుమంతుడి పాత్ర‌లో దేవ‌ద‌త్ లాంటి స్టార్లు భాగ‌మ‌వుతున్నారు. కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌లో బాబి డియోల్ని ఎంపిక చేసిన‌ట్లు ఇటీవ‌ల ప్ర‌చారం కూడా సాగింది.

ఇంకా రామాయ‌ణంలో ఉన్న పాత్ర‌ల‌కు చాలా మంది ప్ర‌ముఖ‌ల పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి రెండేళ్లు అవుతోన్న నేప‌థ్యంలో వీలైనంత వేగంగా ప‌ట్టాలెక్కించాల‌ని నితీష్ ప్లాన్ చేస్తు న్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ లో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లువుతుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే అయోధ్య రామందిరం ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డంతో సినిమాపై మ‌రింత బ‌జ్ క్రియేట్ అవుతోంది.

నిన్న‌టి రోజున అయోధ్య‌లో ఆ వేడుక ఎంత వైభ‌వంగా జ‌రిగిందో తెలిసిందే. బాలీవుడ్..టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఆ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు. దీంతో అయోధ్య మ‌రింత రంగుల మ‌యం అయింది. దేశ‌మంతా శ్రీరామ నామస్మ‌ర‌ణ‌తో మారుమ్రోగింది. ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణం వ‌ర‌కూ ఈ వేడుక‌ను ఎక్క‌డిక్క‌డ ఎంతో వైభ‌వంగా జ‌రుపుకున్నారు. ఈ నేప‌థ్యంలో రామాయ‌ణం సినిమాపై బ‌జ్ మ‌రింత‌గా రెట్టింపు అవుతుంది.

వెండి తెర రామాయ‌ణం ఎప్పుడు? అన్న చ‌ర్చ సైతం నిన్న‌టి రోజున అయోధ్య‌లో హాట్ టాపిక్ గా మారింది. ప‌నిలో ప‌నిగా రామాయ‌ణం ఆధారంగా చేసిన గ‌త సినిమాల గురించి చ‌ర్చ‌కొచ్చింది. హిట్ అయిన సినిమాలు..ప్లాప్ అయిన సినిమాల గురించి ప్ర‌ముఖుల మ‌ధ్య చ‌ర్చ‌కొచ్చిన‌ట్లు తెలుస్తోంది. వాట‌న్నింటికంటే నితిష్ తీవారీ రామాయ‌ణ‌మే హైలైట్ అయింది. ఎందుకంటే ఇండియ‌న్ గ్రేట్ మేక‌ర్స్ లో ఆయ‌న ఒక‌రు. అమీర్ ఖాన్ కెరీర్ లో 'దంగ‌ల్' లాంటి గ్రేట్ విక్ట‌రీ నమోదుకు కార‌కుడు ఆయ‌నే.

దీంతో నితీష్ రామాయ‌ణంపై అంతే అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. అయితే రామాయ‌ణం క‌థ‌ని టెక్నిక‌ల్ గా హైలైట్ చేయాలి. గొప్ప విజువ‌ల్ ట్రీట్ గా మ‌ల‌చాలి. ఇవ‌న్నీ నితీష్ కి కొత్త అన్న‌ది టెన్ష‌న్ పెట్టే అంశం. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ఇలాంటి జాన‌ర్ సినిమాలు ట‌చ్ చేయ‌లేదు. స్టోరీ బేస్డ్ చిత్రాలు చేసారు త‌ప్ప టెక్నిక‌ల్ గా ఆయ‌న ప‌ట్టు ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో రామాయ‌ణం గ‌త వైఫ‌ల్యాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని త‌న రామాయణాన్ని వెండి తెర‌కు ఎక్కించాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది.

Tags:    

Similar News