పాత తప్పు రిపీట్ కాకుండా కొత్త 'రామాయణం'
నితీష్ తివారీ ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేసారు. రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలనేది మేకర్స్ ప్లాన్. మూడు భాగాల కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు వెచ్చిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.
అల్లు 'రామాయణం' గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. నిర్మాత మధుమంతెనతో కలిసి అల్లు అరవింద్ రామాయణం ఇతిహాసాన్ని అత్యంత భారీగా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారమైంది. నితీష్ తివారీ ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేసారు. రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలనేది మేకర్స్ ప్లాన్. మూడు భాగాల కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు వెచ్చిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే 'ఆదిపురుష్' ఫెయిల్యూర్ నేర్పిన గుణపాఠాన్ని నితీష్ మైండ్ లో ఉంచుకున్నారని కూడా తెలుస్తోంది. శ్రీరాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనోన్ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ చివరికి కొన్ని తప్పిదాలతో ఆదిపురుష్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడు ఓంరౌత్ అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సి వచ్చిందని కథనాలొచ్చాయి. అంతగా విమర్శల పాలవ్వడానికి కారణం మోడ్రన్ మేకింగ్ స్టైల్ తో వచ్చిన ముప్పు. నాసిరకం గ్రాఫిక్స్ వర్క్, పాత్రల లుక్స్, చెత్త భాష ఇవేవీ తన సినిమాలో రిపీట్ కాకుండా నితీష్ జాగ్రత్త పడుతున్నారట. స్క్రిప్టు దశ నుంచి ఎంతో కేర్ ఫుల్ గా డీల్ చేస్తున్నారని తెలిసింది. ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంస్థ వీఎఫ్ ఎక్స్ వర్క్ చేసే వీలుందని కూడా సమాచారం ఉంది.
అందరికీ తెలిసిన పదే పదే వీక్షించిన ఇతిహాసంపై సినిమా తీయడం అంటే పెనుసవాల్ లాంటిదే. అందుకే తొలి నుంచి ఎలాంటి అశ్రద్ధ లేకుండా నితీష్ బృందం తగు జాగ్రత్తలతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని తెలిసింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఇంకా.
స్టార్ కాస్టింగ్ పై నితీష్ దృష్టి:
రణబీర్ కపూర్ ఇందులో శ్రీరాముడి పాత్రను పోషించేందుకు అంగీకరించాడని ఇప్పటికే కథనాలొచ్చాయి. మొదటి భాగంలో రణబీర్ -సాయి పల్లవి జంట రాముడు - సీత పాత్రల్లో కనిపిస్తారు. అయితే యష్ రావణాసురుడు పాత్రను రెండవ భాగంలో పరిచయం చేస్తారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి ప్రతిభావంతులైన తారలు ఇలాంటి ఇతిహాసానికి వెయిట్ పెంచుతారే కానీ తగ్గించరన్న పాజిటివ్ బజ్ ఉంది. అంతేకాదు.. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్ర కోసం కేజీఎఫ్ యష్ ని ఆడిషన్ చేసి ఎంపిక చేసారని, అలాగే సీత పాత్రకు సాయిపల్లవిని నితీష్ ఎంపిక చేసారని సమాచారం. అయితే కాస్టింగ్ ఎంపికల గురించి చిత్రబృందం ఇంకా ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. చాలా కాలం క్రితం ఇందులో శ్రీరాముడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ని , ప్రభాస్ ని కూడా సంప్రదించారని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కాస్లింగ్ ఎంపికల్లో మార్పు అనివార్యమైందని అర్థమవుతోంది.