హనుమాన్.. ట్రెండింగ్ లోకి నితిన్ సినిమా
రీసెంట్ గా నితిన్ తన ఫేవరేట్ మూవీ శ్రీ ఆంజనేయం అని చెప్పాడు. మళ్ళీ రీమేక్ చేస్తే ఈ సినిమాని చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
20 ఏళ్ళ క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా శ్రీ ఆంజనేయం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటెంట్ బాగున్నా కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఆ సినిమాని కృష్ణవంశీ తెరకెక్కించారు. హనుమాన్ పాత్రని యాక్షన్ కింగ్ అర్జున్ నటించాడు. ఓ విధంగా చెప్పాలంటే అది సూపర్ హీరో స్టొరీనే. కాకుంటే కృష్ణవంశీ దానిని హైలైట్ చేయకుండా కమర్షియల్ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
మూవీలో నితిన్ క్యారెక్టర్ తో పాటు హనుమాన్ రాములోరి గుడికోసం వచ్చి దుష్టశిక్షణ చేయడం వంటి ప్రతి అంశం కూడా చాలా ఇంటరెస్టింగ్ గా కృష్ణవంశీ డిజైన్ చేశాడు. మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకి అసెట్ అయ్యింది. అద్భుతమైన పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బెస్ట్ ఇచ్చారు. అయిన కూడా ఈ సినిమా అంతగా ఆడలేదు.
రీసెంట్ గా నితిన్ తన ఫేవరేట్ మూవీ శ్రీ ఆంజనేయం అని చెప్పాడు. మళ్ళీ రీమేక్ చేస్తే ఈ సినిమాని చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే అన్ని బాగున్నా ఈ మూవీ సక్సెస్ కాకపోవడానికి కారణం హీరోయిన్ ఛార్మి క్యారెక్టర్ అని టాక్. కృష్ణవంశీ ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ని మరీ ఓవర్ బోల్డ్ గా డిజైన్ చేశాడు.
ఆమెతో ఎక్కువ గ్లామర్ షో చేయించడంతో పాటు, అనవసరంగా ఎక్కువ మాట్లాడేలా సంభాషణలు రాశాడు. ఈ క్యారెక్టర్ కంటెంట్ ఫ్లోని దెబ్బతీసింది. ఇలాంటి భక్తిచిత్రానికి శృతి మించిన రొమాన్స్ అవసరం లేదు. కాని కృష్ణవంశీ తన సినిమాలలో రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా చేయడం వలన మెయిన్ స్టొరీ డిస్టర్బ్ అయ్యింది.
ఈ కారణంగా సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. దీంతో మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు హనుమాన్ విషయంలో ప్రశాంత్ వర్మ హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ లో రొమాన్స్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం వారి ఎమోషన్స్ ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ కారణంగా హనుమాన్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ విషయంలో కృష్ణవంశీ చేసిన పొరపాటు శ్రీఆంజనేయం ఫలితాన్ని మార్చేసింది.