తమ్ముడి పోరాటం..అక్క ఆరాటం!
యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `తమ్ముడు` సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ తో రావడంతో అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా కన్నడ నటి సప్తమీగౌడ నటిస్తోంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ మునిశేఖర్ సారథ్యంలో తీర్చి దిద్దిన ప్రత్యేకమైన సెట్ లో ఓ భారీ యాక్షన్ సన్నవేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాన్ని వారం రోజుల పాటు చిత్రీకరించనున్నారుట. సినిమాలో ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమ్మడు-అక్క అనుబంధంచుట్టూ తిరిగే స్టోరీ ఇది. కానీ వినూత్నంగా ఆవిష్కరించబోతున్నారు. సిస్టర్ సెంటిమెంట్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని..తమ్ముడి-అక్కడ సెంటిమెంట్‌ని సైతం సినిమాలో హైలైట్ చేయబోతున్నారు.
ఈ యాక్షన్ సన్నివేశం సిస్టర్ సెంటిమెంట్ గానే సినిమాలో వస్తుందని సమాచారం. మొత్తానికి తమ్ముడి పోరాటం..అక్క ఆరాటం అన్న చందంగా! ఈ పైట్ సన్నివేశం ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ అక్క ఎవరు? అన్నది సస్పెన్స్. ఓ సీనియర్ నటి సోదరి పాత్రలో నటిస్తుందని సమాచారం తప్ప! ఆమె ఎవరు? అన్నది ఇంతవరకూ రివీల్ చేయలేదు ఈసినిమాతో హిట్ కూడా అంతే కీలకం దర్శక-హీరోలకి. `భీష్మ` తర్వాత నితిన్ చేసిన సినిమాలేవి సరైన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. అలాగే వకీల్ సాబ్ హిట్ అని ప్రచారం తప్ప ఆ తర్వాత వేణు శ్రీరామ్ కి దర్శకుడిగా అవకాశాలు రాలేదు.
మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అవకాశం ఇది. కాబట్టి ఇద్దరు సక్సెస్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. హిట్ కోసం అంతే కసిగా పనిచేస్తున్నారు. అలాగే నితిన్ `రాబిన్ హుడ్` అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.