నితిన్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్.. టాప్ లిస్ట్ ఇదే!

ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.;

Update: 2025-03-27 12:16 GMT
Nithin pre release business

తెలుగు ఇండస్ట్రీలో యూత్ హీరోగా తనదైన మార్కెట్‌ను కొనసాగిస్తున్న నితిన్ తాజాగా ‘రాబిన్ హుడ్’ సినిమాతో బాక్సాఫీస్‌ వేటకు రెడీ అయ్యాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్‌ల్లో భాగంగా విడుదలైన ట్రైలర్ యూత్‌లో హైప్‌ను పెంచింది. నితిన్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీలీల గ్లామర్, మాస్ కామెడీ, ఆకట్టుకునే డైలాగ్స్‌తో ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు, జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొడుతోంది. ఇలా సినిమాకు అన్ని వైపులా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక టెక్నికల్‌గా చూస్తే ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. U/A సర్టిఫికెట్‌తో పాటు 2 గంటల 36 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారు. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండగా, సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్స్, ఎమోషనల్ టర్న్ సినిమాను మరింత ఇంటెన్స్ చేస్తాయట. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో నమ్మకం ఎక్కువగా ఉంది. ‘భీష్మ’ సినిమాతో హిట్ అందించిన డైరెక్టర్ అయిన వెంకీ, ఇప్పుడు మరోసారి తన మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

ఇక నితిన్ కెరీర్‌లో ‘రాబిన్ హుడ్’ కీలకంగా మారబోతోంది. ఎందుకంటే గత రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో ఈసారి నితిన్ మేకోవర్, కంటెంట్ రెండింటిపైనా చాలా ఫోకస్ పెట్టాడు. థియేటర్ బిజినెస్‌, సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఓపెనింగ్స్ స్పీడ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు నితిన్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌లను ఒకసారి పరిశీలిద్దాం:

రాబిన్ హుడ్ - 27.50 కోట్లు

ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ - 24.20 కోట్లు

మాచర్ల నియోజకవర్గం - 21.20 కోట్లు

రంగ్ దే - 23.90 కోట్లు

చెక్ - 16 కోట్లు

భీష్మ - 21.80 కోట్లు

శ్రీనివాస కళ్యాణం - 25.80 కోట్లు

ఇవీ చూస్తే ‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్‌గా నిలిచింది. మార్చి 28న సినిమా గ్రాండ్‌గా విడుదల అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా నితిన్ కెరీర్‌ను మరోసారి బూస్ట్ ఇస్తుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. భారీ థియేటర్ కౌంట్, వార్నర్ ప్రమోషన్, ట్రెండ్ చేస్తోన్న మ్యూజిక్ ఇలా అన్నీ కూడా, ‘రాబిన్ హుడ్’కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి నితిన్ ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News