బాలీవుడ్ రామాయణ.. మళ్లీ మొదటకొచ్చే?
రామాయణ ఇతిహాసాన్ని భారతీయ సినీ పరిశ్రమలో కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ప్రయత్నం చేశారు.
రామాయణ ఇతిహాసాన్ని భారతీయ సినీ పరిశ్రమలో కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ప్రయత్నం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పటి వరకు రామాయణంపై ఏదో ఒక సినిమా తెరకెక్కుతూనే ఉంది. గతేడాది బీటౌన్ దర్శకుడు ఓం రౌత్.. ఆదిపురుష్ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ను రౌత్ తన సినిమాలో చూపించారు. రామాయణ కావ్యాన్ని కాస్త మోడ్రన్ గా చూపించాలనుకున్నా.. ఫెయిల్ అయ్యారు. భారీ బడ్జెట్ కావడంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. దీంతో ఆదిపురుష్ ఎఫెక్ట్ తో మళ్లీ ఏ డైరెక్టర్ కూడా రామాయణం జోలికి వెళ్లరేమో అని అంతా అనుకున్నారు. కానీ బీటౌన్ డైరెక్టర్ నితీశ్ తివారీ.. ఇప్పుడు రామాయణాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.
ఈ ప్రాజెక్టులో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై సినీ ప్రియుల్లో మంచి ఇంట్రెస్ట్ నెలకొంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆలియా భట్ తప్పుకుందని.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా.. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.
అయితే ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ కాస్ట్యూమ్ టెస్ట్ తాజాగా జరిగిందట. దీనిపై డైరెక్టర్ నితీశ్ తివారీ.. సంతృప్తి చెందలేదట. ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రాముడి పాత్రలో రణబీర్ ను తీసుకోవడం ముందే రిస్క్ అనుకున్నారని, ఆ తర్వాత నితీశ్ ప్రొసీడ్ అయ్యారని చెబుతున్నారు. తీరా టెస్ట్ షూట్ వరకు వెళ్లాక నితీశ్ సాటిస్ఫై అవ్వలేదని అంటున్నారు. మరి రాముడి పాత్రపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు.
ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కాస్ట్ ఎంపిక కథ ముందుకొచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ కోసం మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీ రామనవమి రోజు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఏప్రిల్ 17వ తేదీన మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. సినిమా షూట్ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. మరి ఈ రామాయణ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూద్దాం.