హీరోయిన్‌కి బిచ్చగాడి వల్ల చేదు అనుభవం
పూర్తి వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని అడయార్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో బిచ్చగాల్లు చాలా మంది వస్తూ ఉంటారట.
తమిళ చిత్రం 'ఓరు నాల్ కూతు'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నివేతా పేతురాజ్. టాలీవుడ్‌లో ఈమె 'మెంటల్ మదిలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రానప్పటికీ వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. తెలుగులో ఈమె చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కి తో పాటు పలు సినిమాల్లో నివేతా నటించి మెప్పించింది. మరో వైపు తమిళ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం ద్వారా అక్కడ, ఇక్కడ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వస్తోంది. తమిళనాడుకు చెందిన నివేతా ప్రస్తుతం పార్టీ అనే తమిళ సినిమాలో నటిస్తోంది.
తమిళనాడు మధురైలో పుట్టి పెరిగిన నివేదా పేతురాజ్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆమె తండ్రి తెలుగు ఫ్యామిలీ వ్యక్తి కావడంతో నివేదాను తెలుగు అమ్మాయిగానూ పరిగణిస్తూ ఉంటారు. 11 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లి పోయిన నివేదా పేతురాజ్ చదువు కోసం, ఆ తర్వాత సినిమాల కోసం ఇక్కడకు వచ్చేసింది. ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్న ఈమె షూటింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాలకు, ముంబైకి, చెన్నై, మధురై తిరుగుతూ ఉంటుంది. ఇటీవల ఈమెకు చెన్నైలో ఒక చేదు సంఘటన ఎదురైంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని అసహనం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని అడయార్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో బిచ్చగాల్లు చాలా మంది వస్తూ ఉంటారట. ఆ సమయంలో కొందరు పుస్తకాలు అమ్ముతూ అడుక్కుంటూ ఉంటే, మరికొందరు బొమ్మలు అమ్ముతూ అడుక్కుంటూ ఉంటారు. అక్కడ వస్తువు ఖరీదు కంటే నాలుగు అయిదు రెట్లు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తారట. అదే సంఘటన నివేతా పేతురాజ్ కి ఎదురైందట. 8 ఏళ్ల కుర్రాడు చేతిలో పుస్తకాలు పట్టుకుని అడుక్కుంటూ వచ్చాడట. అతడి వద్ద ఉన్న పుస్తకంను తీసుకున్న నివేతా రూ.100లు ఇచ్చిందట.
ఆ బాలుడు తనకు రూ.500లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడట. నివేతా అందుకు ఒప్పుకోక పోవడంతో పాటు, తాను ఇచ్చిన రూ.100లు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించిందట. దాంతో ఒక్కసారిగా ఆ కుర్రాడు తన చేతిలో ఉన్న పుస్తకంను కారులో విసిరేసి, ఆమె చేతిలో ఉన్న డబ్బును లాక్కుని పారిపోయాడట. ఆ జంక్షన్ వద్ద ఇలాంటి సంఘటనలు కామన్‌గా జరుగుతూ ఉంటాయని నెటిజన్స్ చెబుతూ ఉన్నారు.
ఇలా జరుగుతున్నా పోలీసులు ఏం చేయడం లేదు ఎందుకని అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విషయంను సోషల్ మీడియా ద్వారా నివేతా తెలియజేయడంతో వైరల్ అయింది. 8 ఏళ్ల బాలుడు కనుక వదిలేయవచ్చు కదా అంటూ కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం ఇలాంటి సంఘటనలు ఉపేక్షించొద్దు అంటున్నారు.