ఇతడు నా భర్త, వీళ్లు నా పిల్లలు : నివేదా
ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నివేదా మాట్లాడుతూ... ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోను చూసి చాలా మంది నాకు పెళ్లి అయ్యిందని ప్రచారం చేశారు.
నిన్ను కోరి, జై లవకుశ, వకీల్ సాబ్, శాకినీ డాకినీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నివేదా థామస్ ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలను తగ్గించింది. తాజాగా '35 చిన్న కథ కాదు' సినిమాలో నటించింది. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన సమయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.
సినిమాలో నివేదా భార్యగా, తల్లిగా కనిపించబోతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ సభ్యులు షేర్ చేయడంతో చాలా మంది కూడా నివేదా పెళ్లి అయ్యిందని, ఇతడే భర్త అన్నట్లుగా ప్రచారం చేశారట. ఆ విషయాన్ని నివేధా తాజా కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.
ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నివేదా మాట్లాడుతూ... ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోను చూసి చాలా మంది నాకు పెళ్లి అయ్యిందని ప్రచారం చేశారు. ఆ విషయాలను మా అమ్మ నా వద్దకు తీసుకు వచ్చింది.
అమ్మ ఆ ఫోటోలను నాకు పంపించింది. నాకు మీరు ఎప్పుడు సంబంధం చూశారు అన్నాను. ఈ సినిమాలో విశ్వదేవ్ కి భార్యగా నివేదా థామస్ నటించింది. అతడిని చూపిస్తూ నాకు పెళ్లి అయ్యింది, ఇతడే నా భర్త, వీళ్లు ఇద్దరు నా పిల్లలు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.
తిరుపతి నేపథ్యంలో సాగే ఈ సినిమాను రానా సమర్పిస్తున్నాడు. నంద కిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నివేదా నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.