మంచి సినిమాలను ముంచేశారు..
కానీ, ఈ రెండు సినిమాల కు బేబీ దెబ్బ బాగా తగిలింది.
ప్రతివారం ఏదో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రతి డైరెక్టర్ తమ సినిమా ను ప్రేక్షకులు ఆదరించాలని అనుకుంటూ ఉంటారు. అయితే, మూవీ ని అద్భుతంగా తీయడమే కాదు, మనం ఏ సినిమా తో మన సినిమా పోటీపడుతున్నామో కూడా చూసుకోవాలి. లేకపోతే దెబ్బపడే అవకాశం లేకపోలేదు.
గతవారం టాలీవుడ్ నుంచి బేబీ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలే కదా అని అందరూ మొదట తేలికగా తీసుకున్నారు. కానీ, ఈ మూవీ విజృంభించింది. ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడానికి క్యూలు కడుతున్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా లోని హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.అయితే, ఈ మూవీ చిన్న సినిమానే కదా అని రెండు డబ్బింగ్ మూవీస్ కూడా దీనితో పోటీపడటానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ఈ రెండు సినిమాల కు బేబీ దెబ్బ బాగా తగిలింది.
తమిళం లో మామన్నన్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పొలిటికల్ డ్రామా కావడంతో, తెలుగు లో కూడా బాగా క్లిక్ అవుతుందని మేకర్స్ భావించి, గతవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఉదయనిధి స్టాలిన్ హీరో గా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది. నిజానికి ఈ మూవీ మాములు సమయం లో థియేటర్స్ ముందుకు వచ్చి ఉంటే, ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యేది కానీ, ఎవరూ ఈ సినిమా ను కనీసం చూడటానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ప్రమోషన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ వంటి బడా డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు లో విడుదల చేశారు.
సినిమా లో పెద్దగా తెలియ ని వాళ్ళు ఎవరు లేరు. వడివేలు ఒకప్పుడు తెలుగులో కూడా ఒకే తరహాలో క్రేజ్ అందుకున్నాడు. ఇక కీర్తి గురించి చెప్పనక్కర్లేదు. ఉదయనిది స్టాలిన్ కు పెద్దగా క్రేజ్ లేకున్నా ఫాహాద్ కు మాత్రం డిమాండ్ ఉంది. విళ్ళతో ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ చేయించిన సరిపోయేది. కేవలం పబ్లిసిటీ నిర్లక్ష్యం వల్ల ఈ సినిమా కంటెంట్ థియేట్రికల్ గా క్లిక్ కాలేకపోయింది.
దీనికి మరో కారణం కూడా ఉంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 27వ తేదీ న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓటీటీ లో వచ్చేస్తుంది అనే భావనతో కూడా చాలా మంది చూడటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. కారణం ఏదైనా ఈ సినిమా కు తెలుగు లో బాగానే దెబ్బ పడింది.
మరో సినిమా శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం మహావీరుడు. ఈ మహావీరుడు సినిమా ఫుల్ ఎంటర్ ట్రైనర్. కాగా ఈ మూవీ ని కూడా కనీసం ఎవరూ చూడటానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. నిజానికి శివకార్తికేయన్ కి ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది. ఆయన సినిమాలు డబ్బింగ్ అయినప్పుడు ఆసక్తిగానే చూస్తారు. ఆ ధీమాతోనే తెలుగు లో ఈ సినిమా ని కూడా డబ్ లో చేశారు. కానీ ఈ మూవీ మాత్రం బోల్తా కొట్టేసింది.
ఇంతకుముందు ప్రిన్స్ తో తెలుగు లో ప్రమోషన్స్ చేసిన శివకార్తికేయన్ ఈసారి ఈ సినిమా విషయం లో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఏదో రబితేజ తో వాయిస్ ఓవర్ ఇప్పించి పక్కకు జరిగాడు. నిజానికి మంచి సినిమానే కానీ ప్రమోట్ చేయకప్పవడం ఒక తప్పు అయితే.. మరో వైపు నుంచి బేబీ మాయ లో పడి, సినిమా ను ఎవరూ పట్టించుకోలేదు.