ప్యాన్ కి ఉరేసుకుని నటి ఆత్మహత్య
ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ప్యాన్ కి ఉరేసుకుని కుళ్లిన స్థితిలో బాడీ ఉంది.
యువ నటి నూర్ మాళబిక (32) అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఓ అద్దె ఇంట్లో ఉంటోన్న నూర్ ప్యాన్ కి ఊరేసుకుని చనిపోయింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెగులోకి వచ్చింది. నూర్ మృతదేహం గది నుంచి దుర్వాసన రావడంతోనే విషయం బయటకు వచ్చింది. ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ప్యాన్ కి ఉరేసుకుని కుళ్లిన స్థితిలో బాడీ ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోరేగావ్‌లోని సిద్ధార్థ్ ఆసుపత్రికి తరలించి ప్రక్రియ పూర్తి చేసారు. పోలీసులకు నూర్ కుటుంబ సభ్యుల్ని సంప్రదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ మృతదేహాన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసారు.
నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందు కుటుంబ సభ్యులు ముంబైలోని నూర్ ఇంటికి వచ్చారు. వాళ్లు వచ్చిన వెళ్లిన అనంతరం నూర్ సూసైడ్ జరగడం..కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లకపోవడంతో పెద్ద గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కేసును విచారిస్తున్నారు.
నూర్ మాళభిక ఎయిర్ హోస్టస్ గా కెరీర్ ప్రారంభించింది. సినిమాలంటే ఆసక్తి. తొలుత అడల్ట్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది రిలీజ్ అయిన `ది ట్రయల్` వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇందులో కాజోల్ అగర్వాల్ మెయిన్ లీడ్ పోషించింది. ఇంకా నూర్ `సిస్కియాన్`, `వాల్కమాన్`, `టీఖీ చట్నీ`, `జఘన్య ఉపాయ`, `చరంసుఖ్`, `దేఖి అందేఖి`, `బ్యాక్‌రోడ్ హస్టేల్` సిరీస్ లు, సినిమాల్లో నటించింది.