నోరా స్వీట్ వార్నింగ్ ఎవరికబ్బా!
ఆ పోస్ట్ లో ఏమని రాసుకొచ్చిందంటే? `సత్యం మాట్లాడడం.. నా అభిప్రాయాలను వ్యక్తపరచడం మరియు దానిని వాస్తవంగా ఉంచడం నా స్వభావం
బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా పటేహీ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ ఎంపికలతో పాటు...అంతే హాట్ గానూ సోషల్ మీడియాని వెడెక్కించడంలో చొరవ తీసుకుంటుంది. ఫ్యాషన్ ఎంపికల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకతని చాటుతుంది. తాజాగా మరోసారి స్టైల్ కా బాప్ అనిపించే ఫోటోతో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా స్టైలిష్ దుస్తుల్లో కుర్రాకారుని ఆకర్షిస్తుంది.
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కురచ దుస్తుల్లో అమ్మడు అందాల విందు చేసింది. ఎద అందాల ఆరబోతొక్కటే కాదు..అంతకు మించి థైషోతోనూ అలరిస్తుంది. ఆ బ్యూటీని కవర్ చేస్తోన్న కెమెరా వైపు అడ్డుగా చేయి పెట్టి ప్లీజ్ అలా క్లోజప్ వద్దూ అంటూ హోయలు పోతుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్టు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా నోరా ఇన్ స్టాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ఆ పోస్ట్ కి... అమ్మడు డిజైన్ కి ఏమాత్రం సంబంధం లేదు ఆ పోస్టులో ఎవరినో హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఆ పోస్ట్ లో ఏమని రాసుకొచ్చిందంటే? `సత్యం మాట్లాడడం.. నా అభిప్రాయాలను వ్యక్తపరచడం మరియు దానిని వాస్తవంగా ఉంచడం నా స్వభావం! నన్ను నిశ్శబ్దంగా ఉంచడం కష్టం. అదే సమయంలో ఇది సులభం కూడా కాదు ”ఆని స్వీట్ గా నవ్వుతూనే చెప్పింది. వాక్ స్వాతంత్య్రం ఇకపై అంత స్వేచ్ఛగా ఉండకపోవచ్చు. కానీ ఒక కళాకారిణిగా.. ఫతేహి దానిని వాస్తవంగా ఉంచాలని విశ్వశిస్తుంది అని చివరిగా కన్ క్లూజన్ ఇచ్చింది.
మొత్తంగా ఈ పోస్ట్ ఎవరికో వార్నింగ్ లానే ఉంది. కాన్ మాన్ సుకేష్ చంద్ర కేసులో నోరా పటేహీ విచారణ ఎదుర్కుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారణకి హాజరైంది. సుకేష్ తో ఉన్న రిలేషన్ షిప్ కారణంగా అమ్మడు కేసులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సుకేష్ గాళ్ ప్రెండ్స్ ని అందర్నీ ఉద్దేశించి ఓ బాలీవుడ్ సెలబ్రిటీ విమర్శలు చేసాడు. ప్రతిగా సుకేష్ అంతే సీరియస్ అయ్యాడు. మరి నోరా నోరు నొక్కేస్తున్న ఆ అపరిచుతుడు ఎవరో?