మాదాపూర్ డ్రగ్స్ కేసు..నవదీప్​కు నోటీసులు

ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సినీ హీరో నవదీప్​కు నోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Update: 2023-09-21 13:21 GMT
మాదాపూర్ డ్రగ్స్ కేసు..నవదీప్​కు నోటీసులు
  • whatsapp icon

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు .. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సినీ హీరో నవదీప్​కు నోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తితే... మాదాపూర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్స్​లో 2023 ఆగస్టు 31న జరిగిన డ్రగ్‌ పార్టీకి సంబంధించి టీఎస్‌ నాబ్‌ అధికారులు.. రీసెంట్​గా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ఉన్నారు.

అయితే ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్‌ కన్జ్యూమర్‏గా గుర్తించారు పోలీసులు. రైడ్ లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో నవదీప్​ను.. ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు అధికారులు తెలిపారు. తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రాంచందర్ దర్యాప్తులో పేర్కొన్నట్లు చెప్పారు. అందుకే A-29గా నవదీప్ పేరును చేర్చారు పోలీసులు. దీంతో సదరు హీరో పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

అయితే ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఇటీవలే ముందస్త బెయిల్ కోర్టులో అప్లై చేసుకున్నాడు నవదీప్. అయితే దీన్ని విచారించిన న్యాయస్థానం అతడి పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో నవదీప్​కు హైకోర్టులో షాక్ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన న్యాయస్థానం.. ఇరువైపు వాదనలు విని.. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్​ను విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ కు నోటీసులు జారీ చేశారు. 2023 సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ న్యూ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనట్లు తెలిసింది. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, అవి ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో 23న విచారణ చేపట్టనున్నారని సమాచారం అందింది. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి..

Tags:    

Similar News