ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్‌కు అంత ఇష్టమా!

తాజా వీడియోలో అల్లు అర్జున్ ఇంట్లో కనిపించింది ఎన్టీఆర్ బయోపిక్ బుక్ అని తెలిసింది. దీంతో నందమూరి అభిమానులు కూడా దీన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు.

Update: 2024-10-17 16:02 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అతడు ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో చూపించిన ప్రభావమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతలా బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా కథలను ఓకే చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

వాస్తవానికి చాలా కాలం క్రితమే అల్లు అర్జున్ సౌత్‌ మొత్తంలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, డబ్బింగ్ సినిమాల ద్వారా నార్త్ వాళ్లకూ చేరువ అయ్యాడు. ఇక, ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో నేషనల్ అవార్డును అందుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే అతడి కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్ వచ్చేశాడు.

అల్లు అర్జున్ తన అభిమానిని కలుసుకున్నప్పుడు తీసిన ఓ వీడియోను అతడి టీమ్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నెటిజన్లు మొత్తాన్ని ఓ అంశం ఆకర్షించింది. అదే.. బన్నీ ఇంట్లో కనిపించిన NTR అనే పేరుతో పాటు ఆయన ఫొటో ఉన్న ఫ్రేమ్. ఇది చూసిన వాళ్లంతా దాని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చేశాయి.

తాజా వీడియోలో అల్లు అర్జున్ ఇంట్లో కనిపించింది ఎన్టీఆర్ బయోపిక్ బుక్ అని తెలిసింది. దీంతో నందమూరి అభిమానులు కూడా దీన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. స్వతహాగా నందమూరి తారక రామారావు అంటే ఇష్టపడే బన్నీ తన ఇంట్లో ఆయన ఫొటోను కూడా పెట్టుకున్నాడట. అలాగే, ఈ బయోపిక్‌ను సైతం భద్రంగా దాచుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌కు నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. అతడికి జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్. వీళ్లిద్దరూ బావ బావ అని కూడా పిలుచుకుంటారు. తరచూ తమ సినిమాల గురించి, స్పెషల్ డేలలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. అలాగే, బన్నీ.. అన్‌స్టాపబుల్ షో నుంచి బాలయ్యతోనూ చనువుగా ఉంటున్నాడు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీకి అల్లు అర్జున్ దగ్గరగా ఉండడం.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటో, బయోపిక్ గురించి కూడా సమాచారం బయటకు రావడం కొత్త చర్చకు దారి తీసింది అని చెప్పొచ్చు.

Tags:    

Similar News