ఎన్టీఆర్ బాలీవుడ్ 'వార్ 2' డిసెంబర్ అప్‌డేట్
వార్ 2 సినిమా కోసం ముంబైలో షూటింగ్‌లో పాల్గొంటాడు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
దేవర సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమా విడుదల కాక ముందే వార్ 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
నిన్న మొన్నటి వరకు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపిన యూనిట్ సభ్యులు వచ్చే వారం నుంచి ముంబైలోనే వేసిన ప్రత్యేక సెట్‌లో హీరో హృతిక్ రోషన్‌పై సోలో సాంగ్ చిత్రీకరించబోతున్నారు. ఆ పాట చిత్రీకరణ తర్వాత ఎన్టీఆర్‌పై కీలక యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయని, తిరిగి ఎన్టీఆర్ మరో రెండు వారాల పాటు వార్ 2 సినిమా కోసం ముంబైలో షూటింగ్‌లో పాల్గొంటాడు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వార్ 2 సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే వార్ 2 సినిమాను 2025 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయిన వార్ 2ను ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడు. భారీ ఎత్తున సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. బ్రహ్మాస్త్ర వంటి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయాన్ ముఖర్జీ మరోసారి వార్ 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాల వారు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ యాక్షన్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డం దక్కించుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పుడు వార్ 2 తో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. హృతిక్ రోషన్ హీరోగా వార్ 2లో నటిస్తూ ఉండగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వార్ 2 సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ లో ఒక సినిమా రూపొందబోతోంది.