'డ్రాగ‌న్'తో ఎన్టీఆర్-నీల్ చైనా టార్గెట్?

ప్ర‌భాస్ తో స‌లార్ 2 చేయాల్సి ఉండ‌గా, ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కోసం నీల్ సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

Update: 2024-12-24 04:23 GMT

కేజీఎఫ్, కేజీఎఫ్ 2తో భారీ ప్ర‌యోగం చేసిన ప్ర‌శాంత్ నీల్ త‌న ప్ర‌యోగాల్ని కాసుల కుంభ‌వృష్టిగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ లో చేరాక అత‌డి రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేసింది. ఆ త‌ర్వాత పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ తో స‌లార్ 1, స‌లార్ 2 చిత్రాల‌కు ప‌ని చేసాడు. స‌లార్1 బాక్సాఫీస్ వ‌ద్ద సుమారు 700కోట్లు వ‌సూలు చేసింది. దీంతో స‌లార్ 2పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌శాంత్ నీల్ ఇద్ద‌రు అగ్ర హీరోల కోసం ఒకేసారి రెండు సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడ‌ని, నెక్ట్స్ లెవ‌ల్ స్క్రిప్టుల‌ను రెడీ చేస్తున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌భాస్ తో స‌లార్ 2 చేయాల్సి ఉండ‌గా, ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కోసం నీల్ సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

య‌ష్‌, ప్ర‌భాస్ ల‌తో భారీ ప్ర‌యోగం చేసిన‌ట్టే ఇప్పుడు ఎన్టీఆర్ తోను అత‌డు ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. ఈ సినిమాని ఇప్ప‌టికే అధికారికంగా లాంచ్ చేసినందున ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తార‌క్ తో అత‌డు చేయ‌బోయే ప్ర‌యోగం ఎలా ఉండ‌బోతోంది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ సినిమా క‌థ‌కు బంగ్లాదేశ్ కు, డ్రాగ‌న్ దేశం చైనాతోను క‌నెక్ష‌న్ ఉంటుంద‌ని స‌మాచారం. బంగ్లాదేశ్ లో స‌మ‌స్య‌లు ఎదుర్కొనే తెలుగువారిని ర‌క్షించే `డ్రాగ‌న్` స్టోరీని అత‌డు తెర‌పైకి తెస్తున్నాడు. డ్రాగ‌న్ ఎన్టీఆర్ పాత్ర‌ను మ‌రో లెవ‌ల్లో ఎలివేట్ చేయ‌బోతోంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగు వాడు డ్రాగ‌న్. బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర‌ను చిత్రీకరిస్తూ, వలసదారుల చుట్టూ ఈ చిత్రం క‌థాంశం న‌డుస్తుంద‌ని రివీలైంది. ఈ చిత్రం పౌరాణిక డ్రామాతో న‌డ‌వ‌క‌పోయినా... ఫిక్ష‌న‌లైజ్డ్ హిస్టారిక‌ల్ పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని స‌మాచారం. డ్రాగ‌న్ అనేది చైనా సంస్కృతిలో ఒక భాగం. అందువ‌ల్ల అక్క‌డి ఆడియెన్ కి న‌చ్చే టైటిల్ ఇది అని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ చైనా హిస్టారిక‌ల్ క‌నెక్ష‌న్ ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్ ఎలిమెంట్ గా ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఒక‌వేళ ఈ టైటిల్, కంటెంట్ చైనాలోను క‌నెక్ట‌యితే.. ప్ర‌శాంత్ నీల్ - ఎన్టీఆర్ కి ల‌క్ చిక్కిన‌ట్టే.. చైనా ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ డ్రాగ‌న్ ని తెర‌కెక్కిస్తున్నారా? అనే దానిపైనా మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి బంగ్లా దేశ్ క‌నెక్ష‌న్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News