హాలీవుడ్ రేంజ్ లో ఎన్టీఆర్ క్రేజ్

ఈ సీన్స్ ఎన్టీఆర్‌కు హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ తీసుకు వచ్చాయని మరోసారి క్లారిటీ వచ్చేసింది.

Update: 2025-01-18 10:50 GMT

జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అద్భుతమైన నటనతో స్టైల్‌తో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాడు. 'ఆర్ఆర్ఆర్‌' సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఇంటర్వల్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు, రామ్ చరణ్‌తో కలిసిన సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ సీన్స్ ఎన్టీఆర్‌కు హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ తీసుకు వచ్చాయని మరోసారి క్లారిటీ వచ్చేసింది.

హాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లో ఒకరైన మరో దర్శకుడు ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉన్నట్లు తన కోరికను ఓపెన్ గా చెప్పేశాడు. ఆర్ఆర్ఆర్‌ సినిమా వల్ల ఎన్టీఆర్‌ పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విజయవంతమయ్యింది. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రపంచంలో కూడా ఈ సినిమా ప్రభావం విస్తరించింది. ఏకంగా ఎన్టీఆర్‌ని 'టైగర్' అనే పేరు పెట్టి పొగిడిన ప్రఖ్యాత సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు.

Netflix ద్వారా చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు 'ఆర్ఆర్ఆర్‌' చిత్రాన్ని చూసి ఎన్టీఆర్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో తారక్ ప్రదర్శనకు ఎమోషనల్ కంటెంట్‌లో ఉన్న ఇంపాక్ట్‌కు దాసోహమయ్యారు. ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది తెలుగు సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచింది.

జేమ్స్ గన్ మాట్లాడుతూ, "నాకు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. 'ఆర్ఆర్ఆర్‌' లోని యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ నటన నా దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. జంతువులతో దుకే సీన్ అద్బుతంగా ఉంది. అందులో అతను అద్బుతంగా కనిపించాడు. ఒక గొప్ప ప్రాజెక్టులో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను," అని జేమ్స్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జేమ్స్ గన్ గతంలో 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ,' 'ది స్యూసైడ్ స్క్వాడ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఆయన 'సూపర్ మ్యాన్' అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక హాలీవుడ్ లో తనదైన ముద్రవేసిన ఆయన ఎన్టీఆర్ తో పని చేయాలని వ్యక్తపరచడం తెలుగులో హిట్ హీరోల స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచినట్టే. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుండి వచ్చే ప్రతి ప్రశంస ఎన్టీఆర్‌ స్థాయిని మరింతగా పెంచుతోంది.

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్‌' వంటి సినిమాల ద్వారా వచ్చిన ఈ క్రేజ్‌ను గౌరవిస్తూ, నేటి తరం దర్శకులు, నిర్మాతలు మరిన్ని గ్లోబల్ ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తుండటం గొప్ప విషయమే. ఎన్టీఆర్‌ క్రేజ్ హాలీవుడ్‌ లో పెరుగుతుండటంతో, అతని భవిష్యత్ ప్రాజెక్టులు కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు పొందుతాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News