తారక్ అమెరికన్ యాస.. ఎందుకీ రచ్చ?

కొన్ని నెలల క్రితం.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సమయంలో ఇంగ్లీష్ లో మాట్లాడారు.

Update: 2024-10-05 17:30 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. సినిమాలతో పాటు తనకు వచ్చిన లాంగ్వేజెస్ లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సందడి చేస్తుంటారు. అచ్చ తెలుగును అనర్గళంగా మాట్లాడే ఎన్టీఆర్.. తమిళనాడు వెళ్తే తమిళ్.. కర్ణాటకకు వెళ్తే కన్నడ.. కేరళ వెళ్తే మలయాళం.. నార్త్ కు వెళ్తే హిందీ.. అలా తాను వెళ్లిన ప్రాంతం బట్టి మాట్లాడుతుంటారు. కొన్ని నెలల క్రితం.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సమయంలో ఇంగ్లీష్ లో మాట్లాడారు.

ఆ సమయంలో తారక్ మాట్లాడిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి దేవర సినిమా రిలీజ్ కు ముందు ఓ ఇంగ్లీష్ ఛానెల్ కు ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో తారక్.. అమెరికన్ యాసలో మాట్లాడుతూ కనిపించారు. అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే తారక్ అమెరికన్ అసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనేక మంది తారక్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు.

కొందరు నెటిజన్లు.. తారక్ పూర్తిగా ఫేక్ యాసతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. కాస్త అతిగా అనిపించిందని అంటున్నారు. అదే సమయంలో తారక్ ఫ్యాన్స్ వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఫేక్ యాస అలా ఉండదని.. మధ్యలో మిస్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్.. పర్ఫెక్ట్ గా మాట్లాడారని చెబుతున్నారు. బహుశా ఆయనకు బాగా అలవాటేమో అని కామెంట్స్ పెడుతున్నారు. తారక్.. ఎప్పుడూ ఒక గుడ్ స్పీకర్ అని కొనియాడుతున్నారు.

ఆ విషయం మాత్రం నిజమనే చెప్పాలి. సినిమా వేడుకల్లో తారక్ బాగా మాట్లాడుతారు. చెప్పాల్సిన పాయింట్ ను క్లియర్ చెబుతారు. వేరే రాష్ట్రాలకు వెళ్తే అక్కడి వారికి తాను స్థానికుడే అని అనిపించేటట్టు మాట్లాడుతుంటారు. అక్కడి ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. ఈ విషయాన్ని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. అమెరికన్ యాసకు కూడా అదే వర్తిస్తుందని చెబుతున్నారు. ఆయన సరైన రీతిలోనే మాట్లాడారని అంటున్నారు.

కొందరికి ఆయన యాస ఫేక్ గా అనిపించినా.. స్థానిక ప్రేక్షకులకు మరింత చేరువ కావడం మాత్రమే తారక్ ఉద్దేశమని కామెంట్లు పెడుతున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. ముఖ్యంగా తారక్ పై ఎప్పుడూ ఏదో తప్పుడు వార్తను ప్రచారం చేస్తుండడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. మరి తన అమెరికన్ యాస పై వచ్చిన కామెంట్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News