ఎన్టీఆర్ ప్రకటన షాకిచ్చిందే..!
దేవరను తెలుగు, హిందీ సహా తమిళంలోను భారీగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివల కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'దేవర: పార్ట్ 1' సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేశారు. శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. దేవరను తెలుగు, హిందీ సహా తమిళంలోను భారీగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్టీఆర్ చెన్నైలో తమిళ ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తారక్ ఒక పెద్ద ప్రకటన చేశాడు. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ దేవర అని ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఆర్.ఆర్.ఆర్‌లో పని చేసిన తర్వాత ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఒక్క మాటతో తారక్ హైప్ పెంచేసాడు.
అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో పలు సందేహాలను లేవనెత్తింది. కొరటాల తన సినిమా దేవరను రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కంటే గ్రాండ్ గా తెరకెక్కించారా? ఆర్.ఆర్.ఆర్ ని మించిన ఎమోషన్స్ తెరపై పండాయా? అంటూ గుసగుస మొదలైంది. అయితే పెరిగిన హైప్ కి తగ్గట్టు ఈ మూవీలో కంటెంట్ ఉందో లేదో మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. మిక్కిలినేని సుధాకర్ - కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. చిత్రబృందం ఇప్పుడు నాలుగో సింగిల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే దేవర ట్రైలర్ మాస్ లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.