ఫోటో స్టోరి: హిల్స్టేషన్లో ఎన్టీఆర్-ప్రశాంత్-రిషబ్ ఫ్యామిలీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్ కి విరామం ఇచ్చిన సంగత తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్ కి విరామం ఇచ్చిన సంగత తెలిసిందే. అతడు కుటుంబంతో డివోషనల్ యాత్రలో ఉన్నారు. ఈ యాత్రలో ఏం జరిగిందో ప్రతిదీ అభిమానులకు తెలుసు. ఎన్టీఆర్ తన తల్లి, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి గత వారం మంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన పర్యటన సందర్భంగా ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, కేశవనాథేశ్వరాలయం, మూకాంబిక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అయితే వారి భక్తి యాత్ర ఆద్యంతం ఇద్దరు కన్నడ సినీరంగ ప్రముఖులు వారితో ఉన్నారు. అందులో ఒకరు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాగా, మరొకరు కాంతార హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి.. సక్సెస్ తో జోష్ మీద ఉన్న ఆ ఇద్దరితో తారక్ స్నేహం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. ఆ ముగ్గురి కలయికలో సినిమాలపైనా అభిమానుల్లో జోరుగా చర్చ సాగుతోంది. తదుపరి తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనుండగా, రిషబ్ తోను ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
అదంతా ఒకెత్తు అయితే, వృత్తిగత జీవితాన్ని కొద్దిరోజులు పక్కన పెట్టి వీరంతా ఇప్పుడు హిల్ స్టేషన్ లో వెకేషన్ ని ఆస్వాధిస్తూ కనిపించారు. ప్రముఖులంతా వారి భార్యలతో కలిసి హిల్ స్టేషన్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలో తారక్ తల్లి షాలిని కూడా కనిపించారు. ప్రస్తుతానికి దేవర టెన్షన్స్ తో పెట్టుకోకుండా తారక్, తన స్నేహితులైన కన్నడ స్టార్ రిషబ్, డైరెక్టర్ ప్రశాంత్ లతో కలిసి ప్రకృతి మధ్య ఆనందంగా గడుపుతున్నారు.
ఇంతకుముందు మూకాంబిక ఆలయ సందర్శన సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రిషబ్ శెట్టి తనకు తగిన పాత్రను ఆఫర్ చేస్తే `కాంతార2`లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఈ సంవత్సరం సెట్స్ కెళ్లనుంది. అధికారికంగా చిత్రీకరణ షెడ్యూళ్లను ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తారక్ నటించిన దేవర 1 రాకకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.