షార్క్ తో ఫైట్.. రోజంతా అందులోనే తారక్!

అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.

Update: 2024-09-10 16:12 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని చెబుతున్నారు తారక్ అభిమానులు.

ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించారు. మాస్ యాక్షన్ తో ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశారు. హై వోల్టేజ్ సీక్వెన్సుల్లో వేరే లెవెల్ లో అలరించారు. ఎన్టీఆర్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ టేకింగ్.. సినిమాపై హోప్స్ పెంచేసింది. అయితే ట్రైలర్ లోని షార్క్ ఫైట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. తారక్ ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులను తెగ మెప్పించింది. రిపీట్ మోడ్ లో ఆ బిట్ ను చూస్తున్నారు మూవీ లవర్స్.

ఇప్పుడు షార్క్ ఫైట్ సీక్వెన్స్ కోసం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తారక్ మాట్లాడారు. ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్ట పడినట్లు తెలిపారు. ఒక రోజంతా పీకల్లోతు నీళ్లలో అలా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పారు. షార్క్ ఫైట్ కోసం చాలా టైమ్ తీసుకున్నానని వెల్లడించారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తులో ఉన్న భారీ నీళ్ల ట్యాంక్ లో షూట్ జరిగిందని తెలిపారు. ఇప్పుడు తారక్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

దీంతో ఎన్టీఆర్ వర్క్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తారక్ డెడికేషన్ అంటే ఇదేనని అంటున్నారు. సినిమా కోసం ఆయన ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కామెంట్లు పెడుతున్నారు. షార్క్ ఫైట్.. మూవీకి కంపల్సరీగా హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ సీక్వెన్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, దేవర మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది అమ్మడు. బీ టౌన్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. శ్రీకాంత్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరందరినీ ట్రైలర్ లో చూపించారు మేకర్స్. మరి దేవర.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News