తారక్-జాన్వీ మధ్య లిప్ లాక్ తప్పేలా లేదా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న `దేవర` షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న `దేవర` షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోవడంతో పెండింగ్ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చకాచకా ముందుకు కదులుతోంది. ఇటీవలే గోవాలో తారక్-సైఫ్ అలీఖాన్ లపై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్యర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరిగింది.
భారీ వర్షాలతో స్పాట్ లో ప్రతికూల వాతావరణ ఉన్నప్పటికీ టీమ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వర్షం పడుతున్నా? లెక్క చేయకుండా అదే వర్షంలో షూటింగ్ చేసారు. ఓ రకంగా చెప్పాలంటే వర్షంలో ఈ యాక్షన్ సీన్ మరింత గొప్పగా వచ్చిందని యూనిట్ భావిస్తుంది. ఇక తదుపరి షెడ్యూల్ థాయ్ లాండ్ లోని కాబ్రీ దీవుల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ తారక్-జాన్వీలపై రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, ఓ పాట కూడా చిత్రీకరించనున్నారని సమాచారం.
ఇప్పటికే వీళ్లిద్దరు థాయ్ లాండ్ చేరుకున్నారని సమాచారం. ఇది కాస్త అభిమానులకు కిక్కిచ్చే సన్నివేశమే. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలే హైలైట్ అయ్యాయి. వచ్చిన వార్త ప్రతీది దానికి సంబంధించిందే. హీరో, హీరోయిన్ మధ్య ముద్దు ముచ్చటలేదేంటని అభిమానులు నిరుత్సాహ పడుతోన్న సమయంలో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాబ్రీ దీవుల్లో తారక్-జాన్వీ రొమాన్స్ ఎలా ఉంటుందంటూ ? అప్పుడే ఎవరి ఊహకు వారు వదిలేసారు.
అయితే ఈ సన్నివేశాల్లో దర్శకుడు కొరాటాల శివ ఎంత వరకూ లిబర్టీ తీసుకుంటారు? అన్నది చూడాలి. సాధారణంగా కొరటాల చిత్రాలంటే క్లీన్ గా ఉంటాయి. రొమాన్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి నార్త్ ని టచ్ చేయాలంటే కొరటాల కూడా బోర్డర్ దాటక తప్పదు. కాబట్టి కొరటాల-తారక్ ఆ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశాలున్నాయి.