ఎన్టీఆర్ మెచ్చిన 'ఆయ్'.. వ్వాటే మూమెంట్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి సినిమాలకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసేందుకు ముందుంటాడు.

Update: 2024-08-17 13:42 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి సినిమాలకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసేందుకు ముందుంటాడు. ఇక తన సతీమణి తమ్ముడు, బామ్మర్ది అయినటువంటి నార్నే నితిన్ నటించిన సినిమా యూనిట్ కు బెస్ట్ విషెస్ అంధించారు. ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్ 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యింది.

మంచి కథ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘ఆయ్’ చిత్ర విజయం పట్ల, చిత్ర యూనిట్‌కు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రత్యేకంగా చిత్ర యూనిట్‌ను కలుసుకుని, సక్సెస్‌పై వారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ వంటి స్టార్ హీరో నుండి ప్రశంసలు అందుకోవడం టీమ్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది.

ఈ సందర్భంలో ఎన్టీఆర్‌ను కలిసిన వారిలో చిత్ర నిర్మాత బన్నీ వాస్, హీరో నార్నే నితిన్, నిర్మాత ఎస్.కె.ఎన్, హీరోయిన్ నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ఉన్నారు. 'ఆయ్' సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం పట్ల ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

‘ఆయ్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ ఎంటర్టైనర్‌గా రూపొందించబడింది. దర్శకుడు అంజి కె.మణిపుత్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సినిమాలో హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారికల నటనతో పాటు, చిత్రానికి సంబంధించిన అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, విడుదలైన ప్రతీ చోట మంచి కలెక్షన్లు రాబడుతోంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో సాగిన కథ, వినోదంతో కూడిన అంశాలు, సాంకేతిక విలువలు ఈ సినిమాను ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి. మొత్తానికి, ‘ఆయ్’ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, సినిమా పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ విజయాన్ని తారక్‌ వంటి స్టార్ హీరోతో పంచుకోవడం టీమ్‌కి ఒక గొప్ప అనుభవంగా నిలిచింది.

Tags:    

Similar News