ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్.. నీళ్ళల్లో అన్ని రోజులా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-03 05:54 GMT

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా చిత్రంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రారంభం నుంచి కొరటాల శివ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయడంపైన ఫోకస్ పెట్టారు.

అందులో భాగంగా మొదటి షెడ్యూల్ లోనే షిప్ ఫైట్ ని చిత్రీకరించారు. తాజాగా సినిమాలో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని స్టార్ట్ చేశారంట. పూర్తిగా వాటర్ లో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలైట్ గా ఉంటుందంట. యాక్షన్ కొరియోగ్రఫర్ కింగ్ సోలొమన్ ఈ సీక్వెన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వాటర్ ఫైట్ సీన్ ని ఏకంగా 20 రోజుల పాటు తెరకెక్కించనున్నారంట.

పెర్ఫెక్షన్ కోసం తారక్ కూడా ఇప్పటికే నిపుణులైన వారి నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కూడా తీసుకుంటున్నాడంట. ఆ తరువాత ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 20 రోజుల పాటు దేవర మూవీ కోసం వాటర్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే దేవర సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. నవంబర్ ఆఖరుకి మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లిపోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందీలో వార్ 2 సినిమా షూటింగ్ లో తారక్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది పూర్తిచేసుకొని వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాలి.

ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం వలన దేవరపైన తారక్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ చిత్రంతో సోలోగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టి తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

Tags:    

Similar News