దేవర.. హ్యాండ్ ఇవ్వారుగా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర.

Update: 2023-09-04 04:25 GMT

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు 300 కోట్ల వరకు ఈ చిత్రానికి ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తోన్న తారక్ కి ఈ దేవర మూవీ చాలా కీలకమని చెప్పాలి.

అందుకే ఏడాది టైం తీసుకొని పక్కా ప్లానింగ్ తో దేవర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయంట. దేవర కోసం కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఐల్యాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ మొత్తం ఉంటుంది. లుక్స్ నుంచి బ్యాగ్రౌండ్ సెట్స్ వరకు అన్నింటిని సెట్స్ గా డిజైన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ సీజీ వర్క్ కూడా ఈ చిత్రానికి ఉండబోతోంది.

ఈ సినిమాని ఏప్రిల్ 4, 2024న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. దేవర మూవీ షూటింగ్ నవంబర్ ఆఖరుకి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ కానుంది. ఈ మధ్యకాలంలో సీజీ వర్క్ తో ముడిపడిన ప్రతి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. గ్రాఫిక్స్ వర్క్ చెప్పిన టైంకి కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న విధంగా కంప్లీట్ కాకపోవడంతో ఆరు నెలలు వాయిదా పడింది. ఇప్పుడు సలార్ సినిమా కూడా నవంబర్ లేదాడిసెంబర్ కి వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సీజీ వర్క్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నారంట.

ఇప్పుడు దేవర సినిమాకి కూడా అలాంటి పరిస్థితి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఎంత పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లిన సీజీ వర్క్ అనేది దర్శకుడు చేతిలో ఉండదు. విఎఫ్ఎక్స్ కంపెనీలు హ్యాండిల్ చేస్తాయి. అయితే అవి టైంకి ఇవ్వలేకపోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం మూవీ అనుకున్న టైంకి వస్తుందని అంటున్నారు. కానీ అది ఎంత వరకు సాధ్యమవుతుందనేది చెప్పలేని విషయం.

Tags:    

Similar News