ఓన్లీ సీరియస్ అంటే కష్టమేమో దేవర..!
అక్టోబర్ 10న దసరా కానుకగా వస్తున్న దేవర కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఎన్.టి.ఆర్ స్టామినా చూపిస్తుందని అంటున్నారు
ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు వచ్చిన గ్లోబల్ క్రేజ్ ను వాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ దేవర తో టార్గెట్ ఏమాత్రం మిస్ అవ్వకూడదని చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న తారక్ సినిమాలో తాను కేవలం హీరో అనే భావనతో కాకుండా సినిమా అన్ని విభాగాల్లో బాగా వచ్చేలా పనిచేస్తున్నాడు. అందుకే రీసెంట్ గా టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అక్టోబర్ 10న దసరా కానుకగా వస్తున్న దేవర కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఎన్.టి.ఆర్ స్టామినా చూపిస్తుందని అంటున్నారు.
దేవర విషయంలో అంతా బాగానే ఉంది కానీ సినిమా మొత్తం సీరియస్ అంటే మాత్రం కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. ఎంచుకున్న కథ ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా కథనం రాయడంలోనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు దేవర గురించి వచ్చిన లీక్స్ అన్నీ కూడా యాక్షన్ సన్నివేశాల గురించే వచ్చాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.
యాక్షన్ సీన్స్ వరకు ఓకే కానీ సినిమా మొత్తం అదే టెంప్లేట్ తో ఉంటే మాత్రం కష్టమవుతుంది. కొరటాల శివ సినిమాలు అసలే స్లో నరేషన్ తో సాగుతుంటాయి. అలాంటిది భారీ యాక్షన్ పెట్టి కథ నడిపిస్తుంటే దేవర రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. సినిమా భారం మొత్తం ఎన్టీఆర్ తన భుజాన మోసిన ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా అందించాల్సి ఉంటుంది. సో దేవర ఈ విషయంలో కూడా ముందు ప్లానింగ్ తో ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.
కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సెంటిమెంట్ కూడా దేవరకు మైనస్ గా మారుతుంది. సో ఎన్టీఆర్ దేవర ఈ సవాళ్లను దాటి సినిమా సూపర్ హిట్ కొట్టాల్సి ఉంటుంది. దేవర 1 ఈ ఇయర్ అక్టోబర్ లో వస్తుండగా దేవర 2 కూడా మరీ లేట్ చేయకుండా త్వరగానే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దేవర 1 లో పార్ట్ 2 కి సంబందించిన రష్ కూడా ఉంటుంది. దేవర తో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉంది.