వైరల్ : వీరభద్ర స్వామికి ఎన్టీఆర్‌ రూ.12.5 లక్షలు...!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటాడు.

Update: 2024-05-15 10:37 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటాడు. సేవా కార్యక్రమాల కోసం, దైవ భక్తికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఎన్టీఆర్‌ దండిగా విరాళాలు ఇస్తాడు అనే టాక్‌ ఉంది. అది నిజమే అంటూ తాజాగా మరో సంఘటన సాక్ష్యం అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గన్నపేట లో ఏర్పాటు చేసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం మరియు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ రూ.12.50 లక్షల ను విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన విరాళంను గుడి నిర్వాహకులు శిలా పలకం ఏర్పాటు చేసి దానిపై తెలియజేయడం జరిగింది.

ఎన్టీఆర్‌ లక్ష్మీ ప్రణతి దంపతులు, అభయ్ రామ్‌, భార్గవ్‌ రామ్‌, తల్లి షాలిని పేర్లతో గుడిలో శిలా పలకం ఏర్పాడు చేయడంతో దాన్ని అభిమానులు ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. చిన్న గుడికి అంత పెద్ద అమౌంట్ ను ఎన్టీఆర్ విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నట్లుగా ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

మరో వైపు బాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న వార్‌ 2 సినిమా కి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ముంబై లో జరిగిన ఒక షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొనడంతో పాటు కీలక సన్నివేశాలను హృతిక్‌ రోషన్ తో కలిసి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

దేవర సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. దేవర 1 ను ఈ ఏడాది అక్టోబర్‌ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా షూటింగ్‌ పూర్తి అవ్వని కారనంగా అక్టోబర్‌ కి వాయిదా వేశారు.

జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ తో ఐటం సాంగ్‌ చేయించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న కారణంగా పాన్ ఇండియా రేంజ్ లో పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది.

Tags:    

Similar News