ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది బిగ్ సర్ ప్రైజ్

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ఇదివరకే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Update: 2024-08-01 03:30 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రెండు భాగాలుగా రెడీ అవుతోంది. అందులో పార్ట్ 1 రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆల్ మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ఇదివరకే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సాంగ్ కి విశేషమైన రెస్పాన్స్ లభించింది. వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ తో తారక్ దేవర క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ సాంగ్ ఉంటుంది. దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. దీంతో సెకండ్ సింగిల్ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చేస్తున్నారు. దేవర మూవీలో సెకండ్ సింగిల్ గా డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

ఇలాంటి టైంలో దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దేవర టైటిల్ పెట్టి మ్యూజిక్ సింబల్స్ ని పోస్ట్ గా ట్విట్టర్ షేర్ చేశారు. దీంతో దేవర సెకండ్ సింగిల్ రాబోతోందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఏ డేట్ కి రిలీజ్ చేస్తారనేది చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు మూడు రోజుల్లోనే సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.

ఇప్పటికే దేవర సినిమా పైన భారీ హైట్ క్రియేట్ అయి ఉంది. ఫస్ట్ సాంగ్ కూడా సినిమాపై ఎక్స్ పెక్టేషన్ పెంచేసింది. మూవీ బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ తో దేవర సినిమాని నిర్మిస్తున్నారు. బిజినెస్ లెక్కలు చూసుకుంటే 350 నుంచి 400 కోట్లు మధ్య జరిగినట్లు తెలుస్తోంది.

దీన్ని బట్టి టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందని అర్థమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. అనిరుద్ నుంచి రాబోయే సెకండ్ సింగిల్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News