ఎన్టీఆర్ హిందీ ఎంట్రీపై పెరుగుతున్న ఆసక్తి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఏప్రిల్ లో దేవర సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దేవర రాకుండానే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు. హిందీలో 'వార్ 2' తో ఎన్టీఆర్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది. కనుక వార్ 2 తో ఎన్టీఆర్ అక్కడి సినిమాలో నటిస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 ను చేసేందుకు ఎన్టీఆర్ చాలా ఆసక్తిగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా హృతిక్ నటించిన ఫైటర్ సినిమా విడుదల అయ్యింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లతో రికార్డులు బ్రేక్ అవ్వడం లేదు... కానీ ఫైటర్ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. అంతే కాకుండా రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి.
గౌరవ ప్రదమైన వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో హృతిక్ తదుపరి సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 సినిమాతో హృతిక్ రోషన్ మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు.
ఫైటర్ ఫలితం పట్ల వార్ 2 మేకర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఎంట్రీ మూవీ వార్ 2 ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అంటూ ప్రేక్షకులతో పాటు మీడియా వర్గాల వారు కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ వరకు సెట్స్ పైకి వార్ 2 వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.