దేవ‌ర మాటిచ్చాడు నేడు నిల‌బెట్టుకున్నాడు!

మ‌ల‌యాళం అభిమానుల‌కు ఆర్ ఆర్ ఆర్ సినిమా స‌మ‌యంలోనే త‌న త‌దుప‌రి సినిమా మల‌యాళంలో రిలీజ్ అయితే అది త‌న వాయిస్ తోనే ఉంటుంద‌న్నారు.

Update: 2024-01-10 09:52 GMT

ఆ నాడు మాట ఇచ్చాడు..నేడు ఆ మాట‌ని నిలబెట్టుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఎంత క‌ష్ట‌మైనా ఇష్ట‌ప‌డి చేస్తే క‌ష్ట‌మెక్క‌డా అనిపించ‌ద‌ని మ‌రోసారి నిరూపించాడు తార‌క్. అవును ఆయ‌న క‌థానాయ కుడిగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'దేవ‌ర‌'పై అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన గ్లింప్స్ అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇక గ్లింప్స్ లో స్వ‌యంగా తార‌క్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీన్ని బ‌ట్టి త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటాన్నాడ‌ని తేలిపోయింది. ఓ తెలుగు న‌టుడు ఇలా మల‌యాళం మాట్లాడ‌టం అన్న‌ది ఇదే తొలిసారి. యంగ్ టైగ‌ర్ ఇలా మ‌ల‌యాళం మాట్లాడ‌టం అన్న‌ది అప్ప‌టిక‌ప్ప‌డు జ‌రిగింది కాదు. రిలీజ్ చేస్తున్నామ‌ని మొక్కుబ‌డిగా డ‌బ్బింగ్ చెబుతుంది కాదు. మ‌ల‌యాళం అభిమానుల‌కు ఆర్ ఆర్ ఆర్ సినిమా స‌మ‌యంలోనే త‌న త‌దుప‌రి సినిమా మల‌యాళంలో రిలీజ్ అయితే అది త‌న వాయిస్ తోనే ఉంటుంద‌న్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్ర‌చారంలో భాగంగా అక్క‌డి ప్రేక్ష‌కాభిమానుల‌కు ఆయ‌న చేసిన ప్రామిస్ అది.

ఆయ‌న చెప్పింది చెప్పిన‌ట్లు చేసి చూపించాడు నేడు. 'దేవ‌ర' సినిమాకి తానే మొత్తం డ‌బ్బింగ్ చెబుతున్నాడు. గ్లింప్స్ తోనే తార‌క్ హింట్ ఇచ్చేసాడు. సాధార‌ణంగా మ‌ల‌యాళం రిలీజ్ అంటే స్టార్ హీరోలెవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. చిన్న సినిమా మార్కెట్ కాబ‌ట్టి అక్క‌డ పెద్ద‌గా వ‌సూళ్లు ఉండ‌వ‌ని భావించి లైట్ తీసుకుంటారు. తెలుగుతో పాటు త‌మిళ్..క‌న్న‌డ భాష‌లు మ‌న స్టార్లు ఎక్కువ‌గా మాట్లాడుతారు..నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు.

కానీ మ‌ల‌యాళం అనే స‌రికి కాస్త ట‌ఫ్ గానూ భావించి ఆ భాష‌పై అనాస‌క్తిని చూపిస్తుంటారు. కానీ తార‌క్ మాత్రం మ‌రింత మెరుగ్గా త‌న సినిమా ఉండాల‌ని భావించి దేవ‌ర కోసం మ‌ల‌యాళం నేర్చుకుని మ‌రీ డ‌బ్బింగ్ చెబుతున్నాడు. మాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఫేమ‌స్ తెలుగు హీరో ఎవ‌రంటే? అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. అక్క‌డ బ‌న్నీసిని మాల‌కు మంచి డిమాండ్ ఉంది. భారీ అభిమానులు ఉన్నారు. ఆ త‌ర్వాత ఏ తెలుగు న‌టుడికి అంత ఫాలోయింగ్ లేదు. తాజాగా నేటి సినారా మారిన నేప‌థ్యంలో మిగ‌తా స్టార్లు కూడా మ‌ల‌యాళం నేర్చుకోవాల్సిందే అన్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News